బాహుబలి ప్రాజెక్ట్ కోసం రాజమౌళి ఐదేళ్లుగా తపన పడుతున్నాడు. ఇప్పుడు ఆ కల సాకారమయ్యే రోజు వచ్చేసింది. ఏప్రిల్ 28న బాహుబలి2 థియేటర్లలోకి వచ్చేస్తోంది. ముందురోజే ప్రీమియర్ షోస్ వేస్తున్నారు కూడా. మరి బాహుబలి తర్వాత రాజమౌళి ఏం చేస్తాడనే ప్రశ్నకు ఇప్పుడు తనే ఓ సమాధానం ఇచ్చాడు జక్కన్న.
తర్వాతి ప్రాజెక్ట్ సంగతి పక్కన పెడితే.. సినిమా రిలీజ్ కాగానే టూర్ వెళ్లిపోతానంటున్నాడు రాజమౌళి. కొంత కాలం పాటు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాడట. 'మూవీ థియేటర్లలోకి రాగానే నేను భూటాన్ వెళతాను. కొన్ని రోజుల పాటు అక్కడ రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఆసియా మొత్తం మీద అత్యంత ఆనందమైన దేశం అదే అని చాలా మంది చెప్పారు. అక్కడికి వెళ్లాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను' అని చెప్పాడు రాజమౌళి.
మరి తర్వాతేంటి జక్కన్నా అంటే 'నా మనసులో చాలా ఆలోచనలు ఉన్నా ప్రస్తుతం హాలిడే ట్రిప్ గురించే ఆలోచిస్తున్నా. వీలైనంత సమయం కుటుంబంతో గడపాలని భావిస్తున్నా. కొన్ని నెలలు వారితోనే స్పెండ్ చేస్తాను. ఆ తర్వాతే సినిమా గురించి ఆలోచిస్తాను' అని చెప్పాడు రాజమౌళి. మహాభారతం తెరకెక్కించాలనే ఆలోచన రాజమౌళికి ఉన్నా.. రీసెంట్ గా మోహన్ లాల్ అదే ప్రాజెక్ట్ ను ప్రకటించడంతో.. దాన్ని తలపెట్టకపోవచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/