#RRR జ‌క్క‌న్న టైటిల్ ని కాకెత్తుకెళ్లిందా?

Update: 2019-12-17 04:23 GMT
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి రూపొందిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్‌  `ఆర్.ఆర్.ఆర్‌` టైటిల్ స‌స్పెన్స్ గురించి తెలిసిందే. అన్ని భాష‌ల‌కు క‌లిపి కామ‌న్ టైటిల్ గా `ఆర్.ఆర్.ఆర్‌` వుంటుంద‌ని అయితే భాష‌ను బ‌ట్టి మెయిన్ టైటిల్ మారుతుంద‌ని తొలి మీడియా స‌మావేశంలోనే రాజ‌మౌళి టైటిల్ పై క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ చిత్రానికి `రామ రావ‌ణ రాజ్యం`.. `ర‌ఘుపతి రాఘ‌వ రాజారాం` వంటి టైటిల్స్ ని ప‌రిశీలిస్తున్నార‌ని.. అందులో `రామ రావ‌ణ రాజ్యం` టైటిల్ ని ఖ‌రారు చేసే అవ‌కాశం వుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా వి3 ఫిలింస్ సంస్థ‌ ఈ టైటిల్ ని ఎగ‌రేసుకుపోయింది. టైటిల్ క్రేజ్ ని ముందుగానే గుర్తించిన స‌ద‌రు సంస్థ ఫిలిం ఛాంబ‌ర్ లో అధికారికంగా రిజిస్ట‌ర్ చేయించి మీడియాకి ప్ర‌క‌టించేయ‌డం చూస్తుంటే ఒక మంచి టైటిల్ ని జ‌క్క‌న్న వ‌దులుకున్నారే! అన్న టాక్ ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

జ‌క్కన్న కాంటెస్ట్ లోనే ఆస‌క్తి రేకెత్తించిన టైటిల్ రామ రావ‌ణ రాజ్యం. ఇప్పుడు అది ఆయ‌న సొంతం కాదన్న చ‌ర్చ సాగుతోంది. దీంతో `ఆర్ ఆర్ ఆర్‌` టైటిల్ క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ‌ 70 శాతం పూర్త‌యింది. వ‌చ్చే ఏడాదే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్‌.. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. 1920-1947 (ఇండిపెండెన్స్ ఎరా) టైమ్ లో సాగే ఫిక్ష‌న‌ల్ స్టోరీతో ఈ చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు- త‌మిళం- క‌న్న‌డం- మ‌లయాళం- హిందీ భాష‌లతో పాటు మ‌రో ఐదు భాష‌ల్లో రిలీజ్ కానుంది.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌- మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం వైజాగ్ ప‌రిస‌ర ప్రాంతాల్లోని ఏజెన్సీ ఏరియాల్లో జ‌రుగుతోంది. హీరోలు పాల్గొన‌గా కీల‌క ఘ‌ట్టాల‌ను రాజ‌మౌళి అక్క‌డ షూట్ చేస్తున్నారు. ప్రారంభం నుంచే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్ప‌డింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం ప‌ది భార‌తీయ భాష‌ల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని జ‌క్క‌న్న ప్లాన్ చేశారు. ఇక రామ రావ‌ణ రాజ్యం టైటిల్ ని నిర్ణ‌యించే వీలు లేద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. అయితే జ‌క్క‌న్న మైండ్ లో ఇంకే టైటిల్ ఉందో చూడాలి అన్న చ‌ర్చా సాగుతోంది. త్వ‌ర‌లోనే డీవీవీ సంస్థ నుంచి ఏదైనా ప్ర‌క‌ట‌న వ‌స్తుందేమో చూడాలి. ఇక డిసెంబ‌ర్ 31 మిడ్ నైట్ కి కానీ.. 2020 జ‌న‌వ‌రి 1న కానీ టైటిల్ ని ప్ర‌క‌టిస్తారా? అంటూ అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది.
Tags:    

Similar News