దాదాపు ఇరవై ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే. అప్పటికే ఆయన టాలీవుడ్ కు మెగాస్టార్.. బాక్సాఫీస్ దుమ్ము దులిపే సత్తా ఉన్న కథానాయకుడు. అలాంటి ప్రముఖుడు బాలీవుడ్ లో జరిగిన ఒక కార్యక్రమానికి వెళ్లినప్పుడు తనకు ఎదురైన అవమానం గురించి చెప్పుకొని బాధ పడ్డాడు. ఎంత సౌత్ అయితే మాత్రం అంత చిన్నచూపా? అన్న మాట ఆయన నోటి నుంచి అప్పట్లో వినిపించే పరిస్థితి. ఆ తర్వాతి కాలంలో కూడా తెలుగు హీరోలకు బాలీవుడ్ లో అంత గుర్తింపు లేకపోగా.. టాలీవుడ్ ను పెద్ద లెక్కలోకి తీసుకోనట్లుగా వారి తీరు ఉండేది.
అలాంటి లెక్కల్ని సమూలంగా మార్చేసిన మూవీ బాహుబలి. తెలుగు సినిమా మీదా.. తెలుగు చిత్ర పరిశ్రమ మీద బాలీవుడ్ కన్ను పడటమే కాదు.. ఇంత పెద్ద మార్కెట్ ను మనం ఎందుకు మిస్ అయ్యామన్న ఆలోచనలకు కారణమైందని చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలుగు సినిమా బలం తెలిసినా.. బాలీవుడ్ పెద్దగా పట్టించుకునేది కాదు. తనకు అలవాటైన రీతిలో వ్యవహరిస్తూ.. అవమానించటానికి సైతం వెనుకాడే వాళ్లు కాదు.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న మాటకు తగ్గట్లే.. సీన్ రివర్సు అయ్యింది. బాలీవుడ్ వెలవెలపోతుంటే.. టాలీవుడ్ వెలిగిపోతోంది. ఆ మాటకు వస్తే.. సౌత్ కు చెందిన సినిమాలు కొత్త పుంతలు తొక్కుతూ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న పరిస్థితి. దీంతో.. బాలీవుడ్ లో భారీగా తీసే సినిమాల్ని టాలీవుడ్ లోనూ ఘనంగా విడుదల చేయటం ద్వారా.. తాము పెట్టిన పెట్టుబడులను త్వరగా రాబట్టుకోవటానికి వీలుగా ఇప్పుడు ప్లానింగ్ జరుగుతోంది. ఈ కారణంతోనే.. ఎప్పుడూ లేని రీతిలో బాలీవుడ్ కు చెందిన కొందరు తెలివైన హీరో.. హీరోయిన్లు తెలుగును నేర్చేసుకుంటున్నారు. తెలుగు మాటల్ని వల్లిస్తున్నారు.
ఈ వారంలో బ్రహ్మాస్త్రం పార్ట్ 1 విడుదల కానుంది. రణ్ బీర్ కపూర్.. అలియాభట్ .. అమితాబ్.. నాగార్జునతో పాటు భారీ తారాగణం ఈ మూవీకి పని చేసింది. దాదాపు ఐదేళ్లు చెక్కిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాను అనుక్షణం బాక్సాఫీస్ కోణంలోనే చూసే రాజమౌళి.. బ్రహ్మాస్త్రం మూవీని తెలుగు ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టటం లేదని చెప్పాలి.
అందులో భాగంగానే ఆర్ఆర్ఆర్ లో మెరిసిన అలియాభట్ చేత తెలుగులో పాటను నేర్పించటంతో పాటు.. తెలుగు మాటల్ని నేర్పించేసి.. తాను పాల్గొన్న కార్యక్రమాల్లో తనకొచ్చిన తెలుగును ప్రదర్శిస్తూ తెలుగువారి మనసుల్ని దోచే కార్యక్రమానికి షురూ చేసింది. తాజాగా మొదలైన బిగ్ బాస్ సీజన్ 6లోనూ దర్శనమిచ్చిన ఆమె.. మరోసారి తనకున్న తెలుగు ప్రావీణ్యాన్ని ప్రదర్శించింది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి.. కారణం ఏమైనా.. తెలుగులో ఆమె పాడిన పాట చక్కగా ఉండటంతో పాటు.. ఆమె పడిన కష్టాన్ని అభినందించకుండా ఉండలేని పరిస్థితి.
చిత్ర పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం అలియా తెలుగు వెనుక జక్కన్న మాస్టర్ మైండ్ ఉందంటున్నారు. మారిన కాలానికి అనుగుణంగా.. తెలుగు మార్కెట్ లో నిలవాలన్నా.. తెలుగు ప్రజలకు మరింతగా కనెక్టు కావాలంటే తెలుగులో అంతో ఇంతో ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలన్న విషయాన్ని అలియాకు అర్థమయ్యేలా చెప్పటమే కాదు.. ఆమె చేత తెలుగులో పాట పాడించటంలోనూ.. మాట్లాడించటంలోనూ సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. కాలం ఎంత సిత్రం కాకుంటే..ఒకప్పుడు తెలుగును.. తెలుగు నటుల్ని గుర్తించేందుకు ఇష్టపడని పరిశ్రమ.. ఇప్పుడు ఏకంగా తెలుగు నేర్చుకోవటానికి పడుతున్న తపన ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.