జ‌క్క‌న్న‌తో ప‌వ‌న్ భేటీ ఇంత‌కీ ఏమైన‌ట్టు?

Update: 2021-12-01 04:13 GMT
ప‌రిశ్ర‌మలో దేనికైనా మాట్లాడుకుంటే ప‌రిష్కారం దొరుకుతుంది. మాట‌ల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్! అంటేనే స‌మస్య‌. ముఖ్యంగా థియేటర్ల స‌ర్ధుబాటు.. రిలీజ్ తేదీల అడ్జ‌స్ట్ మెంట్లు వ‌గైరా నిర్మాత‌ల గిల్డ్ రూపంలో ప‌రిష్కారం దొరుకుతోంది. కానీ సంక్రాంతి 2022 బ‌రిలో ఉన్న సినిమాల మ‌ధ్య సయోధ్య కుద‌ర‌డం లేద‌ని అది కొంద‌రు నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంగా మారింద‌ని గుస‌గుస వినిపిస్తోంది.

సంక్రాంతి బ‌రిలో ఆర్.ఆర్.ఆర్ - రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా చిత్రాల‌తో పోటీప‌డుతూ ప‌వ‌న్ క‌ల్యాణ్ `భీమ్లా నాయ‌క్` సినిమాని విడుద‌ల చేస్తున్నారు. అయితే ప‌వ‌ర్ స్టార్ ఎంట్రీతో త‌మ సినిమా క‌లెక్ష‌న్ల‌కు కొంత గండి ప‌డుతుంద‌ని ఆర్.ఆర్.ఆర్ టీమ్ భావిస్తోంద‌ట‌. దీంతో నేరుగా జ‌క్క‌న్న రంగంలోకి దిగి ప‌వ‌న్ ని రెక్వ‌స్ట్ చేస్తార‌ని.. భీమ్లా నాయ‌క్ రిలీజ్ తేదీ వాయిదా ప‌డుతుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

కానీ ఇందులో నిజం ఎంత‌? అన్న‌ది ఆరా తీస్తే.. రాజమౌళి ఇంకా పవన్ కళ్యాణ్ ని ఏదీ కోర‌లేదని తెలిసింది. దీంతో భీమ్లా నాయక్ నిర్మాతలు జనవరి 12 న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పంపిణీదారులు బ‌య్య‌ర్ల‌కు ఇదే స‌మాచారం అందింది. మ‌రోవైపు భీమ్లా నాయ‌క్ నుంచి నాలుగో పాట `అడ‌వి తల్లి మాట` నేడు (డిసెంబర్ 1న) విడుదలవుతోంది. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతితో పాటల విడుదల వాయిదా పడింది.

భీమ్లా నాయ‌క్ చిత్రం ఆర్.ఆర్.ఆర్ విడుద‌లైన ఐదు రోజుల‌కు విడుద‌ల‌వుతుంది. అయినా క‌లెక్ష‌న్ల షేరింగ్ తో న‌ష్టం త‌ప్ప‌ద‌ని దాన‌య్య వ‌ర్గాలు భావిస్తున్నాయి. జనవరి 7న RRR విడుల‌వుతుండ‌గా ప‌వ‌న్ భీమ్లా నాయ‌క్ జ‌న‌వ‌రి 12న విడుద‌ల‌వుతుంది. క‌లెక్ష‌న్లు షేర్ అయితే దానివ‌ల్ల ఇబ్బందే. అందుకే ఆర్.ఆర్.ఆర్ టీమ్ ఆందోళ‌న‌. కానీ ఈ విషయంపై రాజమౌళిని కలవడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడటం లేదని సన్నిహితుల నుంచి గుస‌గుస వినిపిస్తోంది. చూద్దాం.. ఇంకా నెల‌రోజుల స‌మ‌యంలో ఏదైనా జ‌ర‌గొచ్చు... ఏద‌యినా మార్పు రావొచ్చు.
Tags:    

Similar News