బాహుబలి సినిమాతో తెలుగు డైరెక్టర్లు ఎవరూ సాధించలేని రికార్డులెన్నో సాధించాడు దర్శక ధీరుడు రాజమౌళి. అలాంటి ట్రెండ్ సెట్టర్ మూవీ తరవాత తెలుగులో తొలిసారి ఓ హైరేంజ్ మల్టీస్టారర్ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా హీరో రామ్ చరణ్ తేజ్ తో జక్కన్న తీయబోయే సినిమాకు సంబంధించి ఆయన తండ్రి - స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథకు తుదిమెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు.
టైటిల్ నుంచే ఇద్దరు హీరోల అభిమానులను ఇంప్రెస్ చేయడం కోసం రాజమౌళి ఓ పాత సినిమా టైటిల్ ను ఈ మల్టీస్టారర్ కోసం ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు.. నాగార్జున కలిసి నటించిన ఇద్దరూ ఇద్దరే సినిమా టైటిల్ ఇప్పుడు తీయబోయే మూవీకి సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారని టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్. పైగా కథ ప్రకారం చూసుకున్నా ఈ టైటిల్ బాగా యాప్టింగ్ గా ఉంటుందని.. దాంతోపాటు హీరోలిద్దరికి సమాన ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు ఉంటుందని జక్కన్న టీం సభ్యులు అంటున్నారు.
బాహుబలి తరవాత సుదీర్ఘ విరామం తీసుకున్న రాజమౌళి మల్టీస్టారర్ విషయంలో కంగారేం పడటం లేదు. ఈ సినిమా కన్నా ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో.. రామ్ చరణ్ బోయపాటి శ్రీనుతో ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దాదాపు ఆరునెలలకు పైగా టైం ఉండటంతో ఆచితూచి వెళ్లేందుకే ఇష్టపడుతున్నాడు. ఇద్దరూ ఇద్దరే అని అందరితో అనిపించాలంటే ఆ మాత్రం ప్రత్యేక శ్రద్ధ అవసరమే.