ఫ్యాన్స్ అంచనాలను దాటి ఆలోచిస్తున్నానన్న జక్కన్న

Update: 2020-03-29 07:28 GMT
కొత్త సినిమా రిలీజులు లేవు.. ప్రమోషన్స్ లేవు కానీ రాజమౌళి టీమ్ ఒక్కసారిగా 'RRR' ప్రచారం మొదలు పెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే కాకుండా రాజమౌళి రీసెంట్ గా బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ తో ముచ్చటించారు.  రాజీవ్ మసంద్ తో సంభాషణలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. 'RRR' గురించి  కూడా మాట్లాడారు.
 
భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే ఇద్దరు పెద్ద స్టార్ హీరోలను ఒక సినిమాలో నటింపజేయడంలో మీకు ఒత్తిడి లేదా అని అడిగితే.. "నేను చిన్నప్పడు కామిక్స్ చదివే సమయంలో స్పైడర్ మేన్.. సూపర్ మేన్ కలిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించేవాడిని. తారక్.. రామ్ చరణ్ ఇద్దరి కుటుంబాల మధ్యలో ఎప్పటి నుంచో పోటీ ఉంది. అయితే వారిద్దరూ మాత్రం మంచి స్నేహితులు. ఇద్దరితో నేను గతంలో పని చేశాను. RRR సినిమాకు అంతా అలా కలిసొచ్చింది" అని చెప్పుకొచ్చారు.

తారక్.. చరణ్ అభిమానుల అంచనాల గురించి అడిగినప్పుడు.. ఫ్యాన్స్ అంచనాలను దాటి ఆలోచిస్తున్నానని.. చిత్రీకరణ సమయంలో సాధారణ ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలని ఆలోచనతో పనిచేస్తున్నానని తెలిపారు. మొన్న రిలీజ్ అయిన 'భీమ్ ఫర్ రామరాజు' ను చూస్తే రాజమౌళి చెప్పేది నిజమే అనిపిస్తోంది.  చరణ్ పాత్రను ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ప్రెజెంట్ చెయ్యడం ప్రేక్షకులను థ్రిల్ చేసింది.

    

Tags:    

Similar News