జక్కన్న చిన్నప్పటి ఆ ఆలోచనకు రూపమే ఆర్‌ ఆర్‌ ఆర్‌

Update: 2020-03-30 23:30 GMT
రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి వంటి భారీ విజయం తర్వాత రూపొందుతున్న చిత్రం అవ్వడంతో ఆర్‌ఆర్‌ఆర్‌ పై అంచనాలు పీక్స్‌ లో ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జక్కన్న అద్బుతమైన కథతో పాత్రలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు ఇంకా కొమురం భీమ్‌ పాత్రల నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందుతున్నట్లుగా జక్కన్న ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. అయితే వారిద్దరి గురించి తెలిసిన విషయాలు కాకుండా తెలియని విషయాలను చూపించబోతున్నట్లుగా జక్కన్న మొదటి నుండి చెబుతూ వస్తున్నాడు.

తాజాగా ఆన్‌ లైన్‌ ద్వారా ఒక జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన జక్కన్న సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయాన్ని వెళ్లడించాడు. తాను చిన్నతనంలో ఎక్కువగా సూపర్‌ మెన్‌ స్పైడర్‌ మెన్‌ సినిమాలు చూసేవాడిని. ఆ సమయంలో వారిద్దరు కలిసి ఒకే సినిమాలో ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన నాకు కలిగేది. అందుకే ఇప్పుడు ఈ సినిమాలో నేను రెండు విభిన్నమైన నేపథ్యం ఉన్న పాత్రలను కలిపే ప్రయత్నం చేస్తున్నాను.

ఎన్టీఆర్‌ ఇంకా చరణ్‌ పాత్రలు చాలా అద్బుతంగా ఉంటాయంటూ జక్కన్న అంచనాలు పెంచుతున్నాడు. మరోసారి వీరిద్దరు కూడా 20 ఏళ్ల వయసులో ఎవరికి కనిపించకుండా కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. ఆ సమయంలో ఏం జరిగింది అనేది పూర్తిగా ఊహజనితమైన కథతో తాను సినిమాగా చూపించబోతున్నట్లుగా జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించాడు. కరోనా కారణంగా షూటింగ్‌ ఆగిపోయిందని త్వరలోనే మళ్లీ మొదలు పెడతామని అంటున్నాడు.
Tags:    

Similar News