సౌత్ లో మల్టీ స్టారర్ లు అంటే ముందు నుంచి కత్తి మీద సాము లాంటివి. అందుకే కన్నడ తమిళ్ తో సహా తెలుగులోనూ మల్టీ స్టారర్స్ చాలా అరుదుగా తెరకెక్కుతూ ఉంటాయి. అందుకే ప్రకటన వచ్చినప్పటి నుంచి తారక్ చరణ్ కాంబోలో రాజమౌళి తీయబోయే సినిమా మీద విపరీతమైన ఆసక్తి నెలకొంది. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ తో చిరంజీవి తిరుగులేని మనిషిలో సపోర్టింగ్ రోల్ చేసాక మళ్ళి నందమూరి కొణిదెల హీరోల కాంబోలో సినిమా రానే లేదు. ఇన్ని దశాబ్దాల తర్వాత వస్తుండటంతో ఫాన్స్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం స్క్రిప్ట్ ఇంకా లాక్ కాలేదట. ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న హీరోలు కాబట్టి ఆషామాషీగా రాసుకుంటే సరిపోదు. అన్ని బాలన్స్ చేయాలి. ఏ చిన్న తేడా వచ్చినా ట్రాలింగ్ మాములుగా ఉండదు.
పైగా గుండమ్మ కథ కాలం కాదిది. అందులో ఎన్టీఆర్ పనోడిగా నటించినా ఏఎన్ ఆర్ కు సూట్ బూట్ వేసుకునే పాత్ర ఇచ్చినా ఫాన్స్ ఫీల్ కాలేదు. కారణం కథ కథనాలు బలంగా ఉండబట్టి. ఇద్దరికీ సమ ప్రాధాన్యం ఇవ్వబట్టి. ఫలితం కూడా చరిత్రలో మిగిలిపోయేలా దక్కింది. కానీ ఇది ప్రతిసరి జరగదు. ఇదే కాంబోలో చివరిసారిగా వచ్చిన రామకృష్ణులు అనే సినిమా గురించి దర్శక నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ చాలా విమర్శలు ఎదురుకోవాల్సి వచ్చింది. దసరా బుల్లోడు లాంటి హిస్టారికల్ మూవీ ఇచ్చిన ఆయనకూ మాటలు తప్పలేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో వెంకీ మహేష్ కలిశారు కానీ ఇద్దరూ సమాంతరమైన వయసు ఉన్న హీరోలు కాదు.
ఇప్పుడు జక్కన్న తీయబోయే సినిమా పరిస్థితి వేరు. అందుకే రాజమౌళి తారక్ చరణ్ కాంబో స్క్రిప్ట్ విషయం చిన్న పొరపాటుకు కూడా అవకాశం లేకుండా నాన్న విజయేంద్ర ప్రసాద్ తో పాటు టీమ్ అందరితో డీప్ డిస్కషన్స్ లో ఉన్నట్టు తెలిసింది. అక్టోబర్ లో అనుకున్న ఓపెనింగ్ డిసెంబర్ కి పోస్ట్ పోన్ కావొచ్చని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఓ ఏడాదికి పైగా ఇద్దరినీ తన సెట్ లో బంధించేయటం ఖాయంగా కనిపిస్తోంది. హీరోయిన్ మొదలుకుని టెక్నీకల్ టీమ్ దాకా ఇంకా చాలా పనులు బాలన్స్ ఉన్నాయని వినికిడి. ఏమైనా మల్టీ స్టారర్లు అంతే వీజీ కాదని జక్కన్నకు అర్థమైనట్టు ఉంది.