బాహుబలి ది బిగినింగ్.. ఇప్పుడు మరో సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతోంది. దేశంలో ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని ప్రాంతాల్లోను - అన్ని భాషల్లోనూ చాలానే రికార్డులు బద్దలు కొట్టేసిన బాహుబలి.. చైనాలో సెన్సేషన్స్ కు వెళ్లింది. వచ్చే నెలలో ఈ చైనా బాహుబలిని విడుదల చేయనున్నారు. విచిత్రం ఏంటంటే.. ఇండియాలో కంటే ఎక్కువగా చైనాలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
చైనా వ్యాప్తంగా 6,500 స్క్రీన్స్ లో బాహుబలి ప్రదర్శించనున్నారు. ఇక్కడ విడుదల చేసిన స్క్రీన్స్ తో పోల్చితే ఇది చాలా ఎక్కువ. అందుకే ఈ మధ్య చాలా సినిమాలు చైనాలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదేమీ అంత ఈజీ కాదు. ఇలా విడుదల చేసేందుకు చాలానే కష్టపడాల్సి ఉంటుంది. 'అక్కడి సినిమాలతో సమానంగా బాహుబలి ది బిగినింగ్ ని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు చాలా కష్టపడ్డారు. చాలా సినిమాలు వెళ్తున్నా అవన్నీ తక్కువ స్క్రీన్లకే పరిమితం అవుతున్నాయి. ఈ అడ్డుగోడను అమీర్ పీకే తుడిచేసింది' అని చెప్పాడు రాజమౌళి.
'బాహుబలి ది బిగినింగ్ 6,500 థియేటర్లలో విడుదల కానుంది. చైనాలో మార్కెటింగ్ చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది. 10-15 ఏళ్ల క్రితమే సినిమా మార్కెటింగ్ పై వారు చాలానే దృష్టి పెట్టారు. బాహుబలి బాగా ఆడాలని కోరుకుంటున్నా. మన సినిమాలు బాగా ఆడాలంటే అది మన కోసం కాదు.. ఈ దారిలో మరిన్ని భారతీయ చిత్రాలు వెళ్లేందుకు దారి ఏర్పడుతుంది' అని చెప్పాడు జక్కన్న.