బాహుబలి: ది కంక్లూజన్.. ఇదే టైమ్ లైన్

Update: 2016-08-07 11:30 GMT
ఇప్పటికే వరల్డ్ వైడ్ బిజినెస్ డీల్ అంతా అయిపోవడంతో.. ''బాహుబలిః ది కంక్లూజన్'' సినిమా ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఏకంగా 350 కోట్ల మేర బిజినెస్ జరిగిందంటే అది మామూలు విషయం కాదు. అందుకే ఈ సినిమా ఏప్రియల్ 28 - 2017న రిలీజ్ అవుతోంది అనగానే అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ బాహుబలి టీమ్ ఈ డేటును అందుకోవడానికి పుల్లుగా ప్రిపేర్ అయ్యిందా మరి?

అత్యంత సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. దర్శకుడు రాజమౌళి ఆగస్టు 31 లోపు మొత్తం షూటింగ్ పూర్తి చేయనున్నాడట. ఇప్పటికే క్లయ్ మ్యాక్స్ యుద్దాన్ని ఆయన పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మొత్తం షూటింగ్ అవ్వగానే.. కొన్ని లింకింగ్ సీన్స్ సెప్టెంబర్ లో తీస్తారట. అనుష్క అండ్ రానా కూడా అప్పుడు షూటింగులో పాల్గొంటారు. ఆ తరువాత నవంబర్ లో ప్రభాస్-అనుష్క - ప్రభాస్-తమన్నా మీద రెండు పాటలను షూట్ చేసి.. ఆ నెలాఖరుకు మొత్తం సినిమా షూటింగును పూర్తి చేస్తారని తెలుస్తోంది.

ఇకపోతే నవంబర్ నుండి ప్రమోషన్లను మొదలెట్టేస్తారట. కొత్త క్యారెక్టర్ల తాలూకు ఫస్ట్ లుక్ - పాత క్యారెక్టర్ల కొత్త లుక్ - అలాగే పాటల టీజర్లు - కొత్త టీజర్లు - చివరకు ఆడియో అండ్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తారట. ఒకేసారి తెలుగు - తమిళ్‌ - హిందీలలో రిలీజ్ అవుతోంది కాబట్టి.. ఈ టైమ్ లైన్ లో ఎక్కడా కూడా ఒక్క ప్లాన్ కూడా మిస్సవ్వడానికి ఛాన్సేలేదట. అది సంగతి.
Tags:    

Similar News