రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం రెండవ షెడ్యూల్ తాజాగా ప్రారంభం అయ్యింది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లపై భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించిన రాజమౌళి రెండవ షెడ్యూల్ లో అయినా హీరోయిన్స్ తో కాస్త రొమాంటిక్ సీన్స్ తీస్తాడేమోనని అంతా భావించారు. రెండవ షెడ్యూల్ ప్రారంభం సమయానికి ఈ చిత్రంలో హీరోయిన్స్ ఎవరనే విషయంపై జక్కన్న క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని టాక్ వినిపించింది. కాని రెండవ షెడ్యూల్ ప్రారంభం అయ్యి మూడు రోజులు అయ్యింది. కాని హీరోయిన్స్ మాట మాత్రం ఎత్తడం లేదు.
ఈ షెడ్యూల్ ను కూడా హీరోలతోనే పూర్తి చేసేలా ఉన్నాడు. సినిమాలో కీలక సన్నివేశాలన్ని పూర్తి చేసి ఆ తర్వాత హీరోయిన్స్ ను రంగంలోకి దించి - పాటలు - ఇతర రొమాంటిక్ - లవ్ సీన్స్ తీస్తాడేమో. ఆర్ ఆర్ ఆర్ మల్టీస్టారర్ చిత్రంలో హీరోయిన్స్ గా ఎవరు నటించబోతున్నారనే విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముగ్గురు ముద్దుగుమ్మలు ఈ చిత్రంలో నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కాని ఆ విషయమై కూడా క్లారిటీ ఇవ్వలేదు.
మూడవ షెడ్యూల్ ప్రారంభ సమయానికైనా జక్కన్న హీరోయిన్స్ ను అనౌన్స్ చేస్తాడేమో చూడాలి. ఇప్పటికే జక్కన్న హీరోయిన్స్ విషయంలో ఒక క్లారిటీకి వచ్చి ఉంటాడని, అయితే ఆ విషయాన్ని మాత్రం సస్పెన్స్ గా ఉంచుతున్నాడేమో అనిపిస్తుంది. ఎన్నాళ్లని సస్పెన్స్ గా ఉంచుతాడు, త్వరలోనే వారు సెట్స్ కు రావాల్సిందే - ఆ సమయంలో అందరికి తెలియాల్సిందే. ఆ సమయం ఎప్పుడు వస్తుందో చూడాలి. వచ్చే ఏడాది చివరి వరకు ఆర్ ఆర్ ఆర్ మల్టీస్టారర్ ను పూర్తి చేసి విడుదల చేయాలని జక్కన్న ప్రయత్నాలు చేస్తున్నాడట.