సక్సెస్ పార్టీ కాదు.. ఆస్కార్ పార్టీ ఇచ్చిన రాజమౌళి

Update: 2023-03-14 18:00 GMT
ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఒక ఎత్తయితే దానితో ఆస్కార్ అవార్డు అందుకోవడం మరో గొప్ప విజయం అని చెప్పాలి.  దేశం మొత్తం గర్వంగా చెప్పుకునేలా నాటు నాటు పాటతో ఆర్ఆర్ఆర్ టీమ్ చరిత్ర సృష్టించింది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇప్పటి వరకు రాని ఆస్కార్ ని అందుకోవడం ద్వారా అరుదైన ఘనతని తమ ఖాతాలో వేసుకున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు వచ్చిన కూడా దీనికి ప్రతి ఒక్కరు అర్హులు అని చెప్పాలి.

మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, చంద్రబోస్ సాహిత్యం, ప్రేమ్ రక్షిత్ డాన్స్ కొరియోగ్రఫీ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్, రాజమౌళి మేకింగ్, రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ ఇలా అందరూ కూడా ఈ అవార్డుకి అర్హత ఉన్నవారు అని చెప్పాలి. వారందరి సమిష్టి కృషి ఫలితమే ఈ అవార్డు.

ఇదిలా ఉంటే ఆస్కార్ అవార్డు రావడంపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇప్పటికి సోషల్ మీడియాలో ఈ మూవీ ట్రెండ్ లో ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా రాజ్యసభ సమావేశాలలో కూడా ప్రత్యేకంగా ఈ మూవీకి ఆస్కార్ అవార్డు రావడంపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే ఆస్కార్ వేడుక అయిపోయిన తర్వాత సక్సెస్ పార్టీని రాజమౌళి లాస్ ఏంజిల్స్ గా తాను తీసుకున్న ఇంట్లో నిర్వహించారు.

ఈ పార్టీలో ఎంఎం కీరవాణి పియానో వాయిస్తూ ఆహ్లాదం నింపారు. ఇక ఈ సెలబ్రేషన్స్ లో ఆర్ఆర్ఆర్ కి వచ్చిన అవార్డులు అన్నింటిని కూడా ఒకే చోట పెట్టారు. వాటి మధ్యలో ఆస్కార్ అవార్డులలో ఉంచారు.

ఇక నాటు నాటు సాంగ్ బెలూన్స్, ఆర్ఆర్ఆర్ బెలూన్స్ తో ఇళ్ళు మొత్తం డెకరేట్ చేశారు. మొత్తానికి ఈ ఆస్కార్ సెలబ్రేషన్స్ ని చిత్ర యూనిట్ మొత్తం చాలా గ్రాండ్ గా చేసుకుందని తెలుస్తుంది. ఇక ఇండియా వచ్చాక కూడా వారికీ గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పడానికి ఆయా స్టార్స్ అభిమానులు సిద్ధం అవుతున్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్ఆర్ఆర్ టీమ్ కి ప్రత్యేకంగా సన్మానం చేయడానికి సిద్ధం అవుతుంది.    



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News