బాహుబలి సినిమా స్టార్ట్ చేసినపుడు ఒక్క తెలుగులోనే తీస్తే వర్కవుట్ కాదనే విషయం దర్శకధీరుడు రాజమౌళికి బాగానే తెలుసు. అందుకే సౌత్ అంతా సత్తా చాటేందుకు వీలుగా యాక్టర్స్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే ఈ మూవీ అనూహ్యంగా సౌత్ - నార్త్ తో పాటు ఇంటర్నేషనల్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు చైనాలో కూడా ఏకంగా 6వేల స్క్రీన్లలో ప్రదర్శనకు సిద్ధమైంది.
బాహుబలి సెకండ్ పార్ట్ బిజినెస్ విషయంలో మాత్రం రాజమౌళి మరిన్ని స్కెచ్ లు వేస్తున్నాడు. చైనా మార్కెట్ లో పాగా వేసేందుకు వీలుగా.. అక్కడి యాక్టర్స్ ను తెరపైకి తేనున్నాడని అంటున్నారు. అందులో భాగంగా ఇప్పుడు హాలీవుడ్ సూపర్ స్టార్ అయిన చైనీస్ పర్సనాలిటీ జెట్ లీని కూడా రంగంలోకి దించుతున్నారట. ఓ ప్రధాన పాత్రలో జెట్ లీని నటిపంచేయాలన్నది జక్కన్న ఐడియాగా తెలుస్తోంది. కనీసం జెట్ లీ కొన్ని సన్నివేశాల్లో కనిపించినా.. బాహుబలి ది కంక్లూజన్ కి ఇంటర్నేషనల్ గా మార్కెట్ విపరీతంగా పెరిగిపోతుంది.
త్వరలో బాహుబలి చైనాలో విడుదల కానుండడంతో.. ఆ రిలీజ్ తర్వాత అక్కడ రియాక్షన్ చూసి.. తన తుది నిర్ణయాన్ని చెబ్తానని జెట్ లీ చెప్పాడని అంటున్నారు. అంటే చైనాలో బాహుబలి హిట్ అయితే.. బాహుబలి2లో జెట్ లీ కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయన్న మాట.