పాన్ ఇండియా సినిమా అంటే అర్థం ఏమిటో చెప్పిన ఏకైక దిగ్ధర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. 1000 కోట్ల క్లబ్ సినిమాల్ని తెరకెక్కించగలిగే అల్టిమేట్ ట్యాలెంట్ దేశంలో తనకు మాత్రమే ఉందని నిరూపించాడు. సమకాలీన ప్రపంచంలో రాజమౌళి నంబర్ 1 దర్శకుడిగా అపజయమెరుగని వాడిగా నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే రాజమౌళి పెద్ద స్థాయిలో ఏం చేసినా కానీ దానికి స్ఫూర్తి హాలీవుడ్ నుంచి ఉంటుందనడంలో సందేహం లేదు.
దేశంలోని ఎందరో ఇతర దర్శకుల తరహాలోనే జక్కన్న హాలీవుడ్ సినిమాల్లో టెక్నిక్ ని అపారంగా ప్రేమిస్తారు. వాటిని తన సినిమాలకు అడాప్ట్ చేసుకోవడంలో ఎంతో పెద్ద సక్సెస్ సాధించారు. 300- గ్లాడియేటర్- ట్రాయ్- ఇన్సెప్షన్ సహా ఎన్నో సినిమాలు రాజమౌళికి స్ఫూర్తి. వాటి నుంచి గొప్ప టెక్నిక్స్ ని తన సినిమాలకు ఆపాదించి అసాధారణ విజయాల్ని అందుకోగలిగారు. ముఖ్యంగా హీరో పాత్రల్ని లార్జర్ దేన్ లైఫ్ ఎలివేషన్ తో చూపించడంలో హాలీవుడ్ టెక్నిక్ ని అతడు సమర్థంగా అనుసరించారనడంలో సందేహమేం లేదు.
బాహుబలి 1- బాహుబలి2- ఆర్.ఆర్.ఆర్ చిత్రాల్లో ఇదంతా కనిపిస్తుంది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ ని పాన్ ఇండియా స్టార్ గా మలిచే పనిలో ఉన్న రాజమౌళి తదుపరి ఏం చేయబోతున్నారు? అన్నది ఆసక్తిగా మారింది. ఒక హాలీవుడ్ స్టార్ కి ఏమాత్రం తగ్గని మహేష్ ఛరిష్మాకు తగ్గ కథాంశాన్ని ఎంచుకోవాలి. దానికి తగ్గట్టే పాత్రను డిజైన్ చేయాలి. యూనివర్శల్ అప్పీల్ తో హిందీ ఇంగ్లీష్ మార్కెట్లలోనూ సత్తా చాటాలన్న గట్టి ప్లాన్ తో ఉన్నట్టు తెలుస్తోంది. దేశ విదేశాల్లో మహేష్ ని ఒక హాలీవుడ్ స్టార్ రేంజులో ఎలివేట్ చేయాలని పాన్ వరల్డ్ మార్కెట్ ని కొల్లగొట్టాలని రాజమౌళి ప్లాన్ వేస్తున్నట్టు తెలిసింది.
ఇక ఈ సినిమాకి అడవి నేపథ్యంలో కథాంశాన్ని ఎంచుకోవడం వెనక చాలా లాజిక్ ఉంది. ఇందులో గొప్ప ప్రకృతిని జలపాతాలని పచ్చందాలను ఆవిష్కరిస్తూ అక్కడ అద్భుతమైన పాత్రలను పరిచయం చేస్తూ గిరిజన సంస్కృతిని ఎలివేట్ చేస్తూ అవతార్ తరహాలో ఒక చక్కని సందేశాన్ని కూడా రాజమౌళి అందించే ప్లాన్ లో ఉన్నారనేది ఒక గుసగుస.
రాజమౌళి గత పాన్ ఇండియా చిత్రాల తరహాలోనే లార్జర్ దేన్ లైఫ్ పాత్రలు మైమరిపిస్తాయి. ఇందులో యాక్షన్ ఘట్టాలు మరో లెవల్ లో అలరిస్తాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక విలన్ గా ఒక ప్రముఖ బాలీవుడ్ హీరో నటించేందుకు ఛాన్సుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఇందులో మహేష్ కి ధీటైన విలన్ ఎవరన్నది ఇప్పటికి సస్పెన్స్.
కానీ సోషల్ మీడియాల్లో రకరకాల గెస్ లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక యాక్షన్ కి మరో లెవల్ మీనింగ్ చెప్పే టైగర్ ష్రాఫ్ ని ఎంపిక చేస్తే బాలీవుడ్ లోనూ గొప్ప క్రేజ్ వస్తుందని కొందరు అభిమానులు జక్కన్నకు సూచిస్తున్నారు. కానీ ఆయన మైండ్ లో ఎవరున్నారు? అన్నది ఇప్పటికి సస్పెన్స్. ఇక అడవి నేపథ్యం అనగానే అవతార్ పండోరా గుర్తుకు రాకుండా ఉండదు. దానికి భిన్నమైన ఒక గ్రహాన్ని రాజమౌళి చూపించాల్సి ఉంటుందని కూడా అభిమానుల్లో ప్రీగెస్సింగ్ ఉత్కంఠగా సాగుతోంది. అడవి నేపథ్యంలో హాలీవుడ్ లో ఎన్నో క్లాసిక్స్ ఉన్నాయి. అవతార్ - అనకొండ- అపోకలిప్టో- ది గ్రీన్ ఇన్ ఫెర్నో- హంటర్- శాంక్టమ్- ది గ్రే- డెత్ హంట్ .. ఇలా ఎన్నో క్లాసిక్స్ హాలీవుడ్ లో తెరకెక్కాయి. వాటన్నిటికీ భిన్నంగా రాజమౌళి అడవి నేపథ్యంలో సినిమా తీయాల్సి ఉంటుంది. ఆసక్తికరంగా అడవి నేపథ్యంలో తెరకెక్కిన టక్కరి దొంగలో మహేష్ కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. జయంత్ .సి.ఫరాన్జీ ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో మహేష్ కౌబోయ్ పాత్రలో