#RRR మూవీ న్యూఇయర్‌ సర్‌ ప్రైజ్‌ ఏంటో?

Update: 2019-12-17 11:33 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌ చివరి దశకు వచ్చింది. వచ్చే నెలలో షూటింగ్‌ పూర్తి చేసేందుకు యూనిట్‌ సభ్యులు నిర్విరామంగా షూట్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చినా ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ ను దర్శకుడు విడుదల చేయలేదు. అదుగో ఇదుగో అంటూ సోషల్‌ మీడియాలో అయితే ప్రచారం జరుగుతోంది. కాని ఇప్పటి వరకు జక్కన్న నుండి ఎలాంటి స్పందన రాలేదు.

మళ్లీ ఎప్పటిలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ ఫస్ట్‌ లుక్‌ రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ ల లుక్‌ ను ఒకే సారి ఒకే పోస్టర్‌ ద్వారా విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది. ఇదే సమయంలో ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్‌ కు ఫుల్‌ ఫార్మ్‌ ఏంటీ అనే విషయమై కూడా జక్కన్న క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయంటూ కొందరు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. కాని కొత్త సంవత్సరంకు సినిమా నుండి ఫస్ట్‌ లుక్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే ఫ్యాన్స్‌ చాలా అసహనంతో ఉన్నారు. కొత్త సంవత్సరంకు కూడా రాకుంటే సినిమాపై బ్యాడ్‌ గా టాక్‌ మొదలు అయ్యే అవకాశం కూడా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్బంగా జక్కన్న ఏదైనా సర్‌ ప్రైజ్‌ ప్లాన్‌ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో కూడా టాక్‌ వినిపిస్తుంది. మరి జక్కన్న ఇచ్చే ఆ సర్‌ ప్రైజ్‌ ఏంటో చూడాలి.
Tags:    

Similar News