అన్న కొడుకు గురించి రాజమౌళి ఎమోషన్

Update: 2017-03-28 07:57 GMT
కాలభైరవ.. ఈ పేరు వినగానే ‘మగధీర’ సినిమా గుర్తుకొస్తుంది. అందులో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో హీరో పేరు అదే అన్న సంగతి తెలిసిందే. రాజమౌళి పర్టికులర్ గా తన హీరో పాత్రకు ఆ పేరు పెట్టడానికి ప్రత్యేక కారణం ఉందని ఇటీవలే తెలిసిందే. తన అన్నయ్య కీరవాణి కొడుకు పేరు కాలభైరవనే. అతడంటే చిన్నప్పట్నుంచి రాజమౌళికి ఎంతో ఇష్టమట. రాజమౌళి చేతుల మీదుగానే అతను పెరిగాడట.

కాలభైరవ మీద ఇష్టంతోనే తన కెరీర్లో మైలురాయిలాంటి సినిమాలో హీరో పాత్రకు అదే పేరు పెట్టుకున్నాడు రాజమౌళి. ఇన్నాళ్లూ కీరవాణి కొడుకు గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఐతే ‘బాహుబలి: ది కంక్లూజన్’లో రెండు ముఖ్యమైన పాటలు పాడిన కాలభైరవ.. గాయకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి మార్కులు కొట్టేశాడు. రెండో రోజులుగా అతడి పేరు మార్మోగిపోతోంది. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందాడు కాలభైరవ.

ఈ నేపథ్యంలో కీరవాణి కంటే కూడా రాజమౌళి ఎక్కువ ఎగ్జైట్ అయిపోతున్నాడు. ట్విట్టర్లో తన అన్నయ్య కొడుకు గురించి స్పందించాడు రాజమౌళి. కాలభైరవను చిన్న బిడ్డగా ఉన్నప్పటి నుంచి తన చేతుల్లో పెంచానని.. ఈ రోజు అతడి పాటకు వస్తున్న స్పందన చూస్తే చాలా ఉద్వేగంగా ఉందని.. తన అన్నయ్య కంటే కూడా కాలభైరవనే బాగా పాడాడని ప్రశంసలు దక్కుతున్నాయని.. ఈ ఫీలింగ్ ను మాటల్లో వర్ణించలేనని రాజమౌళి అన్నాడు. ‘ది కంక్లూజన్’లో కాలభైరవ.. దండాలయ్యా.. ఒక ప్రాణం పాటల్ని పాడాడు. అతడి వాయిస్ కీరవాణికి చాలా దగ్గరగా ఉండటం విశేషం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News