ఈ ఏడాది ఎన్ని సినిమాలు వచ్చినా అందరూ మాట్లాడుతుంది మాత్రం ఒకే సినిమా గురించే. అదే రాజమౌళి బాహుబలి. ఇప్పుడు ఏ స్టార్ ఎక్కడకు వెళ్ళినా వారిని అడిగే ప్రశ్నలలో ఒకటి బాహుబలి గురించి ఉంటోంది. సినిమా విజయం అంతా బాగానే ఉంది కానీ ఆ మధ్య శ్రీదేవి అన్నమాట కొంచం వివాదం అయ్యింది. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ నటించిన పాత్రలో శ్రీదేవి ముందు నటించవలిసి ఉంది అయితే ఆమె కోరికలు కోటను దాటటంతో శ్రీదేవిని వదిలేసి రమ్యకృష్ణ పెట్టుకున్నామని రాజమౌళి ఓపెన్ గా చెప్పేశాడు. ‘మామ్’ సినిమా ప్రచారం కోసం తెలుగు సీమలో అడుగుపెట్టిన శ్రీదేవికి బాహుబలి విమర్శ దెబ్బ గట్టిగానే తగిలింది.
అప్పుడు శ్రీదేవి ఏం చెప్పింది అంటే.. “నేను అలాంటి దాన్ని కాను. డబ్బులు ఎంత తీసుకోవాలి నాకు తెలుసు. నేనూ ఒక ప్రొడ్యూసర్ భార్యనే. నేను అటువంటి కోరికలు ఏమి అడగలేదు. అయన రాజమౌళి అలా చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు. గొప్ప స్థాయిలో ఉన్న డైరెక్టర్ అలా మాటలాడి ఉండకూడదు'' అనేసింది. ఇదే విషయంగా రాజమౌళిని అడిగితే “మీరు ఏమి విన్నారు అన్నది ఆమె ఏమి చెప్పింది అనేది పక్కన పెడదాం. వాదించుకోవడం అనవసరం ఇప్పుడు. ఈ విషయం జనాలకు వదిలేద్దాం వాళ్ళు ఎలా అర్ధం చేసుకున్నా పర్వాలేదు కానీ ఒక విషయం చెబుతాను నేను ఏదో ఆమె అంత అడిగింది అవి కావాలంది.. అని చెప్పకుండా ఉండాల్సింది'' అన్నాడు.
ఇక శ్రీదేవిని పొగుడుతూ.. ''శ్రీదేవి బాలీవుడ్ లో చేస్తున్న పనికి చాలా సంతోషం. మన సౌత్ నుండి వెళ్ళి అక్కడ ఇన్నేళ్ళుగా స్టార్ హోదాలో ఉండటం మన అందరికీ గర్వకారణం. ఆమె ‘మామ్’ సినిమా విజయం పొందాలి అని కోరుకుంటున్నాను” అని చెబుతూ సెలవు తీసుకున్నాడు.