బాహుబలి-2లో వాళ్లిద్దరే కీలకమంటున్న జక్కన్న

Update: 2017-04-01 10:18 GMT
‘బాహుబలి: ది కంక్లూజన్’ అనగానే అందరికీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నే గుర్తుకొస్తోంది. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. దీంతో పాటు ఇందులోని యాక్షన్ ఘట్టాలు.. విజువల్ ఎఫెక్ట్స్ కోసం కూడా ఆసక్తితో ఉన్నారు. ఐతే తన దృష్టిలో వీటన్నిటికంటే శివగామి-దేవసేన పాత్రల మధ్య సాగే ఎమోషనల్ సీన్లే ‘బాహుబలి-2’కు హైలైట్ అంటున్నాడు దర్శకుడు రాజమౌళి. వాళ్లిద్దరి మధ్య లవ్-హేట్ రిలేషనే బాహుబలి రెండో భాగానికి ఆయువు పట్టు అని రాజమౌళి చెబుతున్నాడు.

‘‘అందరికీ శివగామి పాత్ర బలమైందని తెలుసు. ఐతే దేవసేన పాత్ర కూడా అంతే బలమైంది. వీళ్లిద్దరి మధ్య వచ్చే లవ్-హేట్ రిలేషన్ షిప్ కీలకం. దీని చుట్టూ కీలకమైన 20-30 నిమిషాల సీక్వెన్స్ వస్తుంది. అందులో డ్రామా బాగా పండుతుంది. ప్రేక్షకుల ఆసక్తిని పెంచే ఘట్టమిది. వీళ్లిద్దరి పాత్రల నేపథ్యంలో వచ్చే డ్రామాకు సంబంధించిన సన్నివేశాల్ని ఎడిట్ చేయడానికి నాకు మనసొప్పేది కాదు. నా సినిమాలో ఆ రెండు పాత్రలు ఉన్నందుకు నేను అదృష్టవంతుడిని. ఈ సినిమా డెప్త్ ఆ రెండు పాత్రల వల్ల ఎంతో పెరిగింది’’ అని రాజమౌళి తెలిపాడు. ‘బాహుబలి: ది బిగినింగ్’లో మాదిరే రెండో భాగంలోనూ శివగామి పాత్ర తన ప్రాధాన్యాన్ని నిలుపుకుంటుందని.. దేవసేన పాత్ర ఇందులో చాలా కీలకంగా మారుతుందని జక్కన్న అంటున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News