ఇల్లు మారుతున్న జక్కన్న కుటుంబం

Update: 2019-01-22 16:44 GMT
ఎస్ ఎస్ రాజమౌళి తన తాజా చిత్రం #RRR సెకండ్ షెడ్యూల్ ను సోమవారం నాడు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ డిసెంబర్ లో పూర్తయిన తర్వాత #RRR టీమ్ ఒక లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం.. సంక్రాంతి పండగ సందడి ఇలా అన్నీ హాలిడేస్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు అందరూ వర్క్ మోడ్ లోకి వచ్చేశారు.

ఇకపై రాజమౌళి #RRR షూట్ ను పరుగులు పెట్టించేలా ప్లాన్ చేసుకున్నారట. అందుకే నానక్ రామ్ గూడ ఏరియాలో ఈ సినిమా కోసం వేసిన సెట్ కు దగ్గరలోనే టెంపరరీగా ఒక ఇంటి నిర్మాణం చేయించుకున్నారు.  ఆ ఇంటికే ఇప్పుడు రాజమౌళి కుటుంబం షిఫ్ట్ అవుతున్నారని అంటున్నారు.  దీంతో షూటింగ్ పర్యవేక్షణ సులువు కావడమే కాదు. షూటింగ్ లొకేషన్ కు ప్రయాణం చేసే టైమ్ కూడా మిగిలిపోతుంది.  రషెస్ చూడడం..  ఎడిటింగ్ ను సూపర్ వైజ్ చేయడం తదితర కార్యక్రమాలు ఈజీ అవుతాయనే రాజమౌళి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట. ఒక్క రాజమౌళి కుటుంబానికి మాత్రమే కాకుండా #RRR కు పనిచేసే కీలకమైన నటులకు.. టెక్నిషియన్లకు కూడా వసతి సదుపాయాలు కల్పించారట.  ఆర్టిస్టులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు కూడా ప్రత్యేకమైన సదుపాయాలు ఉన్నాయట.

రాజమౌళి ఒకసారి రంగంలోకి దిగితే ఇక ఆ సినిమా విడుదలయ్యే వరకూ తన ఫోకస్ 100% ఆ సినిమాపైనే ఉంటుంది. వీలైనంతవరకూ తన సమయం ఆ సినిమాపై వెచ్చించడానికే చూస్తాడు. బెస్ట్ క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు.  ఈ సారి ఏకంగా సినిమా కోసం ఇల్లు మారుతూ టాలీవుడ్ లో ఓ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాడు.


Tags:    

Similar News