రాజమౌళి కొడుకు మోసం చేశాడట

Update: 2017-07-30 08:52 GMT
కొత్తగా వారాహి సినిమా వారు నాగచైతన్య హీరోగా తీసిన ''యుద్దం శరణం'' సినిమాకు రాజమౌళి కొడుకు కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్ గా పనిచేశాడు. అంటే దర్శకుడికి తగినట్లు.. ప్రొడ్యూసర్ ఇచ్చిన మేరకు.. షూటింగ్ ప్లానింగ్ అంతా చేయాలనమాట. అయితే ఇలా పనిచేసిన కార్తికేయ.. ఈ సినిమాలో వాడిన డ్రోన్స్ (ఫ్లయ్ క్యామ్స్) విషయంలో ఒక డ్రోన్స్ తయారీ సంస్థను మోసం చేశాడని.. ఒక డ్రోన్ ఆపరేటర్ కంప్లయింట్ చేస్తున్నాడు.

ఈరోజు తెలుగు మీడియాలో వచ్చిన వార్తలను బట్టి చూస్తే.. కార్తికేయ సదరు వ్యక్తి నుండి ఒక రకమైన డ్రోన్లు కావాలని అడిగాడట. అయితే ఆ డ్రోన్ తయారుచేయడానికి కావల్సినంత సమయం ఇవ్వకుండానే డ్రోన్లు కావాలంటూ సెట్ కు తెచ్చేయమన్నారట. తీరా తెచ్చేశాక.. తొమ్మిదిరోజుల పాటు సెట్లో ఆ డ్రోన్స్ ఉంచుకుని.. 10వ రోజున నువ్వు సరిగ్గా చెప్పింది చేయలేదు అంటూ కామెంట్ చేశారట. అంతేకాదు.. పేమెంట్ ఇవ్వకపోగా.. ఇప్పుడు ఆ డ్రోన్స్ కూడా ఇవ్వట్లేదని అతను వాపోతున్నాడు. అసవనరంగా తన పేరు వగైరా వివరాలను బయటకు చెబితే.. కార్తికేయ ఒక పెద్ద డైరక్టర్ కొడుకు కాబట్టి తన ఫ్యూచర్ ప్రమాదంలో పడుతుందని సదరు వ్యక్తి భావిస్తున్నాడట.

ఇదే విషయం కార్తికేయను ప్రశ్నిస్తే.. అతను చెప్పిన పని సరిగ్గా చేయలేదు. అతని డ్రోన్స్ నా దగ్గర ఉన్నమాట వాస్తవమే కాని వాటితో నేను మాత్రం ఏం చేసుకుంటాను. అతనికి సగం పేమెంట్ ఇచ్చాం. కాని అందులో 10% పని కూడా అతను చేయకపోగా అతని వలన ప్రొడక్షన్ హౌస్ చాలా నష్టపోయింది. రేపోమాపో అతని డ్రోన్స్ అతనికి తిరిగిచ్చేస్తాను.. అంటూ చెబుతున్నాడు. అది సంగతి.


Tags:    

Similar News