రాజమౌళి తాజా చిత్రం #RRR పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్దేట్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో నటించే నటులను సెలెక్ట్ చేసే బాధ్యత జక్కన్న తన తనయుడు కార్తికేయకు అప్పగించాడట.
అంటే కార్తికేయ #RRR క్యాస్టింగ్ టీమ్ కు లీడర్ అన్నమాట. ఈమధ్యనే ఈ సినిమాకు యాక్టర్స్ ను సెలెక్ట్ చేసేందుకు కేరళ పయనమై వెళ్ళాడట కార్తికేయ. అక్కడ థియేటర్ ఆర్టిస్టులను ఆడిషన్ చేసి ఈ సినిమాకు సరిపోయే నటులను ఎంపిక చేస్తాడట. కేరళ అంటేనే వండర్ ఫుల్ యాక్టర్స్ కు పేరు.. మలయాళం నటులు అలవోకగా నటనలో అవార్డులు సాధిస్తారు. మరి మన జక్కన్న తనయుడి కన్ను ఏకంగా మల్లు ల్యాండ్ పై పడిందంటే.. అక్కడి నుంచి సరైన నూతన నటులను వెలికి తీస్తాడేమో.
దీని సంగతేమో గానీ #RRR టీమ్ మాత్రం కార్తికేయ కేరళకు వెళ్ళిన కారణం అది కాదు అని - టాలీవుడ్ ఫిలిం మేకర్స్ కు ఉపయోగపడేలా కార్తికేయ ఒక డేటాబేస్ ఏర్పాటు చేస్తున్నాడని కవర్ చేస్తున్నారు.