వాళ్ల భుజాలపై నుంచున్నాం -రాజమౌళి

Update: 2017-03-26 18:00 GMT
అసలు ఈనాడు బాహుబలి సినిమా కోసం ఇలా ఒక స్టేజ్ మీద నుంచున్నా అంటే.. ఇది స్టేజ్ కాదు.. ఇది కొందరి వర్కర్ల భుజాలు. వారి భుజాలపై మేం నుంచున్నాం.. అంటూ బాహుబలిః ది కంక్లూజన్ కోసం పనిచేసిన చిన్న చిన్న కార్మికులను కూడా పేరుపేరునా పొడిగేశాడు రాజమౌళి. తాను మాట్లాడ్డానికి సమయం తక్కువగా ఉన్నా కూడా.. సినిమాకు పనిచేసన ఎంతోమంది వర్కర్లను ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కొనియాడాడు జక్కన్న.

''వర్కర్స్ ఎంతోమంది ఉన్నారు. బ్యాక్ పెయిన్ తో పనిచేసిన మా జిమ్మీ ఆపరేటర్స్ నాగరాజు.. ఈ సినిమా ప్రీ లుక్ డిజైన్ చేసిన కాన్సెప్ట్ ఆర్టిస్ట్స్.. టీలు అందించిన ప్రొడక్షన్ కుర్రాళ్ళు.. సెట్లకు రంగులు వేసిన వర్కర్స్.. సాంగ్స్ కంపోజింగ్ లో సాయం చేసిన ఫైట్ మాష్టర్లు.. ఫైట్లను తీయడంలో సాయం చేసిన కొరియోగ్రాఫర్లు.. అసలు డ్యాన్స్ మాష్టర్ అయ్యుండీ బాణాల ఫైట్ సీక్వెన్స్ ను కంపోజ్ చేసిన శంకర్ మాష్టర్.. ప్రతీ ప్రాప్ కోసం రిగ్గింగ్ అద్బుతంగా చేసిన సాల్మాన్.. కాస్ట్యూమ్స్ కృష్ణ..'' ఇలా చాలామంది పేరుపేరునా పొగిడేశాడు రాజమౌళి. అలాగే తన ఎడిటర్.. డబ్బింగ్ ఇన్ చార్జ్.. సౌండ్ సూపర్ వైజ్ చేసిన కళ్యాణి మాలిక్ (మ్యూజిక్ డైరక్టర్).. ఇలా అందరినీ పొగిడేశాడు.

అలాగే ఈ సినిమా రెండవ భాగం కోసం తన కొడుకు కార్తికేయ సినిమా సెకండ్ యునిట్ ను బాగా డైరక్ట్ చేశాడని చెప్పాడు రాజమౌళి. ఫస్టు పార్టు ట్రైలర్ ను తాను ఒక స్టోరీ చెప్పి కట్ చేయించినా కూడా.. 2వ పార్టుకు మాత్రం కార్తికేయ తన టీమ్ తో కలసి సొంతంగా ట్రైలర్ కట్ చేశాడని.. 25 వర్షన్లు కట్ చేశాక ఒకటి పిక్ చేశానని ఆయన తెలిపాడు.
Tags:    

Similar News