నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ బ్యానర్ పై రెండవ ప్రయత్నంగా ఫలక్ నుమాదాస్ ఫేం విశ్వక్ సేన్ హీరోగా హిట్ అనే చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. శైలేష్ కొలను అనే కొత్త కుర్రాడు ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రమిది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు దర్శకులు రాజమౌళి.. రాఘవేంద్ర రావు..అనుష్క అతిథులుగా విచ్చేసి పబ్లిసిటీ సాయం అందించారు. ఈ వేదికపై జక్కన్న వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి.
టీజర్..ట్రైలర్ అదిరిపోయాయని కితాబివ్వడమే గాక.. ఇదే ఐడియా ఆయనకి వచ్చిందని..ఇలాంటి థాట్ తో గతంలో హాలీవుడ్ లో 2012 అనే ఓ సినిమా చూసానని అన్నారు. సినిమాలో కీలక సన్నివేశాన్ని ముందే రివీల్ చేయడంతో ఆ తర్వాత ఏం జరుగుతోందో చూడాలన్న ఆసక్తి తో థియేటర్లకు అప్పటి ప్రేక్షకులు వెళ్లారని తెలిపారు. హిట్ కూడా అలాంటి ఐడియాతో వస్తోన్న చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేసారు. అయితే ఓ టాప్ డైరెక్టర్ సినిమా చూడక ముందే బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేయడం విమర్శలకు తావిస్తోంది. సైరా నరసింహారెడ్డి లాంటి సినిమా ప్రమోషన్ కు వచ్చినప్పుడు జక్కన్న ఇలా స్పందించలేదు.
ఇదంతా కేవలం నానిపై ప్రేమా? అంటూ కామెంట్ చేస్తున్నాయి. హిట్టా..పట్టా అని తేల్చాల్సింది రిలీజ్ తర్వాత కదా..రిలీజ్ కు ముందే రివ్యూ ఏంటో అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నాని చాలా ప్రయోగాలు చేసినా పెద్దగా వర్కవుటవ్వలేదు. టైటిల్ ప్రయోగాల పైనా నానికి బాగా తెలుసు. కానీ ఈ సినిమాకు హిట్ అనే టైటిల్ పెట్టాడంటే.. కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుందని దర్శకేంద్రుడు రాఘేవేంద్రరావు వ్యాఖ్యానించడం విశేషం. ఇంకా అనుష్క నాని నిర్మాతగా చేసిన తొలి చిత్రం అ కాన్సెప్ట్ బాగా నచ్చిందని.. రెండవ ప్రయత్నం డిఫరెంట్ గా ఉందని..తప్పక సక్సెస్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేసింది. మరి సినిమా గురంచి ఈ ముగ్గురూ చాలా ధీమా వ్యక్తం చేసారు. మరి ఆ అంచనాలను హిట్ అందుకుంటుందా? లేదా? అన్నది ఈనెల 28న తేలిపోతుంది. వెయిట్ అండ్ వాచ్.