జ్యో అచ్యుతానంద ట్రైలర్ చూస్తే ఏం ఫీలింగ్ కలిగింది.. అదో మ్యూజికల్ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లాగే అనిపించింది కదా. ఐతే దర్శక ధీరుడు రాజమౌళికి మాత్రం అందులో సస్పెన్స్ థ్రిల్లర్ లక్షణాలు కనిపించాయట. రాజమౌళికి అలాంటి ఫీలింగ్ ఎందుకు కలిగిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘జ్యో అచ్యుతానంద ట్రైలర్ చాలా చాలా బాగుంది. ఇదో కామెడీ రొమాంటిక్ మూవీలా అనిపించింది. మంచి మ్యూజికల్ సినిమాలాగా కూడా అనిపించింది. అలాగే అందులో నాకు సస్పెన్స్ థ్రిల్లర్ లక్షణాలు కూడా కనిపించాయి. రోహిత్.. నాగశౌర్య ఇద్దరూ రెజీనాను ప్రేమిస్తున్నారు. అన్నదమ్ములిద్దరూ ఒకే అమ్మాయిని లవ్ చేయడమేంటి.. వీళ్లిద్దరిలో రెజీనా ఎవరిని ప్రేమిస్తుంది.. ఆమె ఉద్దేశమేంటి అన్నది పెద్ద సస్పెన్స్ లాగా కనిపిస్తోంది నాకు. అందుకే సస్పెన్స్ థ్రిల్లర్ అన్నాను’’ అని ‘జ్యో అచ్యుతానంద’ ఆడియో వేడుకలో రాజమౌళి అన్నాడు.
ఇంకా ఈ సినిమా గురించి ఇంకా జక్కన్న మాట్లాడుతూ.. ‘‘రెజీనా ట్రైలర్లోనే హావభావాలతో చంపేసింది. రోహిత్ వాయిస్ చాలా బాగుంటుంది. నాగశౌర్య అందంగా ఉంటాడు. వీళ్లిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరినట్లు అనిపిస్తోంది. ఈ ట్రైలర్ విషయంలో.. సినిమా విషయంలో ఎక్కువ మార్కులు వేయాల్సి వస్తే అది మా అన్నయ్య కళ్యాణ రమణకే వేస్తా. ఎవరెంత చేసినా.. సంగీతంతో ప్రాణం పోసింది ఆయనే. సంగీతం వల్లే ట్రైలర్ ఆహ్లాదంగా అనిపించింది. నిర్మాత సాయికొర్రపాటి డైరెక్టర్లను నమ్మే ప్రొడ్యూసర్. ఆ నమ్మకంతో సినిమాను పూర్తిగా దర్శకుడి మీద వదిలేస్తాడు. అలాంటి నిర్మాతను ఇంకెక్కడా చూలేదు. ‘జ్యో అచ్యుతానంద’లో సూపర్ హిట్ కళ కనిపిస్తోంది’’ అని రాజమౌళి అన్నాడు.