అలా ఉంటూనే RRR షూటింగ్.. రాజమౌళి డెడికేషన్ ఇది..!

Update: 2022-12-03 02:30 GMT
రాజమౌళి ఎందుకు గొప్ప దర్శకుడు అన్నది ఆయన చేసిన సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఆయన చేస్తున్న ప్రతి సినిమా విజయాలు అందుకుంటూ వస్తున్నాయి. ఇక బాహుబలి సినిమా తో తెలుగు సినిమా స్థాయి ఏంటో అందరికి తెలిసేలా చేశాడు. ఇక ఆర్.ఆర్.ఆర్ తో ఆయన చేసిన అద్భుతాలు కూడా అందరికీ తెలిసిందే. మెగా నందమూరి కాంబోలో సినిమా అంటే అదో పెద్ద సాహసమే అలాంటి సాహసం చేసి సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు జక్కన్న.

అయితే ఈ సినిమా టైం లో తనకు హెల్త్ బాగా లేకపోయినా సరే అవేవి పట్టించుకోకుండా సినిమా మీద ఫోకస్ పెట్టారు. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆర్.ఆర్.ఆర్ లో నటించిన శ్రీయ వెల్లడించారు. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు నుంచే రాజమౌళి ఆస్తమాతో ఇబ్బంది పడ్డారట. అయితే ఓ పక్క అలా బాధపడుతూ ఉన్నా షూటింగ్ కొనసాగించారట. అంతేకాదు షూటింగ్ స్పాట్ లో దుమ్ము దూళి ఉన్నా అవేవి పట్టించుకోకుండా సినిమా అవుట్ పుట్ మీదనే తన దృష్టి ఉంచారు. అంత డెడికేషన్ ఉంది కాబట్టే ఆయన విక్టరీకి కేరాఫ్ అడ్రస్ గా మారారు.

సినిమా విషయంలో రాజమౌళి కమిట్మెంట్ గురించి ఆ సినిమాలో నటించిన హీరోలు చాలాసార్లు చెప్పారు. ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్ సినిమా టైం లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ అయితే అది బాగా చెప్పారు. నాటు నాటు సాంగ్ టైం లో ఆ పర్ఫెక్ట్ సింక్ కోసం తమను చాలా ఇబ్బంది పెట్టారని అన్నారు. హీరోలిద్దరు అలా చెప్పినా సరే తను అనుకున్నది పర్ఫెక్ట్ గా రావడం కోసం అలా చేయాల్సి వచ్చిందని అన్నారు రాజమౌళి.

ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో మూవీ చేస్తున్నారు. ఈ మూవీని ఇంటర్నేషనల్ లెవల్ లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. మహేష్ సినిమాను 2023 సెకండ్ హాఫ్ లో స్టార్ట్ చేయనున్న రాజమౌళి 2025 లో ఆ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ పై వరల్డ్ వైడ్ గా సినీ లవర్స్ అంతా భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News