బాహుబలి శివలింగాన్ని మించే పోజు

Update: 2015-11-14 11:30 GMT
ఏ విషయంలోనూ బాహుబలి ముందు ఓ లెక్క.. తర్వాత లెక్క అన్నట్లుగా ఉంది టాలీవుడ్ పరిస్థితి. కలెక్షన్లు, రికార్డులలోనే కాదు.. పోస్టర్ల విషయంలనూ బాహుబలి ది బిగినింగ్ సృష్టించిన సెన్సేషన్ అంతాఇంతా కాదు. ముఖ్యంగా ఈ మూవీలో ప్రభాస్ చేసిన రెండో కేరక్టర్ శివుడు పాత్ర.. శివలింగాన్ని పైకెత్తి మోసే పోజ్ ఓ సంచలనం. ఈ పోస్టర్ కి వచ్చిన రెస్పాన్స్ కానీ, అప్లాజ్ కానీ సాధారణమైనది కాదు.

ఆ పోజుతో వినాయక చవితికి గణేష్ విగ్రహాలు కూడా కనిపించాయంటే.. శివుడు-శివలింగం పోజ్ ఎంతగా హిట్ అయిందో అర్ధమవుతుంది. దీనికి మించినదేదీ ఇప్పటివరకూ రాలేదు కానీ.. ఇప్పుడు ఇంతకు మించిన మరో పోజ్ రెడీ అవుతోంది. ఈ కొత్త పోజ్ కూడా బాహుబలి ఖాతాలోకే వెళ్లనుండడం విశేషం. బాహుబలి2 కోసం జక్కన్న ఓ పోస్టర్ ని రెడీ చేస్తున్నాడు. ఇది శివలింగం పోస్టర్ కి మించి సెన్సేషన్ సృష్టించేలా జాగ్రత్త పడుతున్నాడు.  ఈసారి వంతు శివుడుది  కాదు.. తండ్రి కేరక్టర్ అయిన బాహుబలిది. సీక్వెల్ లో బాహుబలి పాత్రకు ప్రాధాన్యత - స్టోరీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ పాత్రకు సంబంధించిన పోజ్ రెడీ అవుతోంది.

బాహుబలి సీక్వెల్ కోసం కండలు పెంచే పనిలో ఉన్నారు ప్రభాస్ - రాణా - అనుష్క ఏమో సైజ్ జీరో కోసం పెంచిన సైజులు కరిగించుకోనుంది. డిసెంబర్ 15న అఫీషియల్ గా షూటింగ్ ప్రారంభించి, 4-5 నెలల్లో టాకీ పార్ట్ వరకూ కంప్లీట్ చేయాలన్నది జక్కన్న ఆలోచన. మరో 5-6నెలలు గ్రాఫిక్ వర్క్ కి కేటాయించి.. 2016డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు బాహుబలి ది కంక్లూజన్ ని తీసుకొచ్చేలా రాజమౌళి షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు.
Tags:    

Similar News