అల్లరి నరేష్ 'బచ్చల మల్లి'.. ట్రైలర్ ఎలా ఉందంటే?

రావు రమేష్ డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఎదుటోడిని కొట్టే విషయంలో ఆయన శ్రద్ధ.. అని చెబుతుండగా నరేష్ ఎంట్రీ ఇచ్చారు. ఫైట్ సీక్వెన్స్ లో అదరగొడుతూ కనిపించారు.

Update: 2024-12-14 12:23 GMT

టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బచ్చల మల్లి. సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో మల్లు బ్యూటీ అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 1990 బ్యాక్ డ్రాప్ లో సాగే బచ్చల మల్లిలో నరేష్.. నెవ్వర్ బిఫోర్ మాస్ లుక్ లో కనిపించనున్నట్టు క్లారిటీ వచ్చేసింది.

ఇప్పటికే అన్ని పూర్తి పనులు చేసుకున్న బచ్చల మల్లి చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ కొద్ది రోజుల క్రితం అనౌన్స్ చేశారు. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ కూడా చేపడుతున్నారు. వరుస అప్డేట్స్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. సినిమా కచ్చితంగా చూడాలనిపించేలా హైప్ సృష్టిస్తున్నారు.

ఇప్పటి వరకు మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా.. నేడు ట్రైలర్ ను తీసుకొచ్చారు. నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదల చేశారు. "మీరు ప్రతిరోజూ కలిసే.. మీ భావోద్వేగాలు కలిగి ఉండే వ్యక్తి" అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. నరేష్, అమృతల స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

రావు రమేష్ డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఎదుటోడిని కొట్టే విషయంలో ఆయన శ్రద్ధ.. అని చెబుతుండగా నరేష్ ఎంట్రీ ఇచ్చారు. ఫైట్ సీక్వెన్స్ లో అదరగొడుతూ కనిపించారు. అలా ప్రతి విషయంలో గొడవపడుతూ మూర్ఖుడిగా ఉంటారు. ఇంతలో హీరోయిన్ తో ప్రేమలో పడతారు. ఆమె కోసం తన అలవాట్లు మార్చుకుంటారు.

అయితే ఆ తర్వాత నరేష్ కు పలు సంఘటనలు ఎదురవుతాయి. వాటిని ఎలా డీల్ చేస్తారు? చివరకు ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానాలే సినిమాగా ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇక నరేష్.. మాస్ అవతార్ లో తన పాత్రలో ఒదిగిపోయారు. బాడీ లాంగ్వేజ్, క్యారెక్టర్ కోసం ఆయన మేకోవర్ చేసుకున్న విధానం వేరే లెవెల్ లో ఉంది.

హీరోయిన్ అమృతా అయ్యర్ తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్నారు. దర్శకుడు సుబ్బు మంగాదేవి ఎమోషనల్ అండ్ మాస్ స్క్రిప్ట్ ను రాసుకున్నట్లు తెలుస్తోంది. తనదైన శైలితో డైరెక్ట్ చేసినట్లు అర్థమవుతుంది. విశాల్ చంద్రశేఖర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు మెయిన్ అసెట్ గా మారింది. నిర్మాత రాజేష్ దండా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా సాగుతూ మెప్పిస్తోంది. సినిమాపై అంచనాలు కూడా పెంచుతోంది.

Full View
Tags:    

Similar News