ఊరక మెచ్చరు ఘనచరితులు అన్నారు పెద్దలు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అంతటి వారు ఒక ట్వీట్ వేశారంటే అందులో ఎంతో మ్యాటర్ ఉంటుందనే అర్థం. ఆ కోవలో చూస్తే ఇటీవల విడుదలకు సిద్ధమవుతున్న అన్యాస్ ట్యూటోరియల్ కి రాజమౌళి చేస్తున్న ప్రచారం చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. కంటెంట్ లేనిదే ఆయన పబ్లిసిటీ ఎందుకు ఇస్తారు?
ఇంతకుముందు అన్యాస్ ట్యూటోరియల్ ట్రైలర్ ని లాంచ్ చేసిన రాజమౌళి మూవీ ఎంతో ప్రామిస్సింగ్ గా ఉంటుదని అన్నారు.తాజాగా ఇదే ట్రైలర్ ని షేర్ చేసి రిలీజ్ తేదీని ఆయన ట్వీట్ చేయడంతో ఆసక్తి పెరిగింది. జూలై 1న ఈ మూవీ విడుదలవుతోంది. చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్న సైకలాజికల్ హారర్ సిరీస్ ఇది. నా స్నేహితుడు శోభు నిర్మాత. ఆయనకు ఆయన టీమ్ కి ఆల్ ది బెస్ట్! అంటూ రాజమౌళి ట్వీట్ చేసారు.
ప్రభాస్ పబ్లిసిటీ సాయం..బాహుబలి స్టార్ ప్రభాస్ తోనూ ప్రచారం అందుకున్న వెబ్ సిరీస్ 'అన్యాస్ ట్యుటోరియల్ కి పల్లవి గంగిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సౌమ్య శర్మ రచయిత. బాహుబలి ఫ్రాంఛైజీ నిర్మాతలు శోభు యార్లగడ్డ- ప్రసాద్ దేవినేని ఆర్కా మీడియా పతాకంపై ఈ సిరీస్ ని నిర్మించారు.
ఇది ఆహా OTT లో ఒరిజినల్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ లో రెజీనా కసాండ్రా- నివేదిత సతీష్- అగస్త్య తదితరులు నటించారు. చాలా కాలం క్రితమే చిత్రీకరణ పూర్తి కాగా స్ట్రీమింగుకి ముందు ప్రస్తుతం ప్రచారం వేడెక్కిస్తోంది. ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ అన్య ట్యుటోరియల్ టీజర్ ను రిలీజ్ చేసి టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు. టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అటుపై సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ SS రాజమౌళి ఆహా ద్విభాషా సైబర్ హారర్ సిరీస్ 'అన్యాస్ ట్యుటోరియల్' ట్రైలర్ ను లాంచ్ చేసి టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు.
హాలీవుడ్ మిర్రర్స్ సహా పలు హారర్ చిత్రాల స్ఫూర్తి ఈ సినిమాలో కనిపిస్తోంది. ట్రైలర్ ఆద్యంతం భయం కల్పించే గగుర్పాటుకు గురి చేసే కంటెంట్ అంచనాలను మరో లెవల్ కి తీసుకెళ్లింది. ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఫియర్ ఫ్యాక్టర్ కి సంబంధించిన ఎలివేషన్ షాట్స్ తో ఆకట్టుకుంది.
ఈ 7 ఎపిసోడ్ ల సిరీస్ విడుదలవుతుండగా ట్రైలర్ తో మరింత ఆసక్తిని పెంచగలిగింది. అన్య ట్యుటోరియల్ సిరీస్ ఇద్దరు సోదరీమణుల మధ్య వార్ గా కనిపిస్తోంది. ఈ సిరీస్ తో పల్లవి గంగిరెడ్డి దర్శకులుగా పరిచయం అవుతున్నారు. 1జూలై 2022న 'ఆహా' ఏడు ఎపిసోడ్ లతో సిరీస్ ని ప్రసారం చేస్తుంది.