మరోసారి జక్కన్న గ్రాఫిక్స్ మాయ

Update: 2018-06-01 10:30 GMT
రాజమౌళి సినిమాల్లో కథ - స్క్రీన్ ప్లే ఎంత అద్భుతంగా ఉంటుందో... గ్రాఫిక్స్ కూడా అంతే అద్భుతంగా ఉండేలా ఛూసుకుంటాడు. ప్రేక్షకులను థ్రిల్ చేయడం కోసం గ్రాఫిక్స్ లో ఎక్కడా రాజీ పడడు. అందుకే జక్కన్న సినిమాలు తెలుగులోనే కాదు.. రిలీజైన ప్రతి భాషలోనూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.

బాహుబలి-2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు - ప్రశంసలు దక్కించుకున్న రాజమౌళి తన తరవాత సినిమాగా భారీ మల్టీస్టారర్ తీయడానికి రెడీ అయ్యాడు. రామ్ చరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా తీసే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసేశారు. అసలు గ్రాఫిక్స్ అవసరం లేకుండా ఈ మూవీ తీద్దామని అనుకుంటున్నానని రాజమౌళి గతంలో ఓసారి చెప్పాడు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నట్టే కనిపిస్తోంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న నేపథ్యంలో గ్రాఫిక్స్ తో తీయడమే కరెక్టనే డిసైడయ్యాడట.

మల్టీ స్టారర్ మూవీలో గ్రాఫిక్స్ కోసం రూ. 50 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారనే తెలుస్తోంది. ఈ బడ్జెట్ తో తెలుగులో ఓ భారీ కమర్షియల్ తీసేయొచ్చు. కానీ ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఆడియన్స్ ను థ్రిల్ చేసేలా ఉండాలంటే గ్రాఫిక్స్ హై రేంజిలోనే ఉండాలి. కాబట్టే ఫిలిం మేకర్లు భారీ మొత్తం పెట్టుబడి పెట్టడానికి రెడీ అయిపోయారు. సో రాజమౌళి నుంచి మరో విజువల్ వండర్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చన్న మాట.
Tags:    

Similar News