బాహుబలి’ చిత్రం తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న జక్కన్న ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం కోసం కోకా పేటలో భారీ సెట్ ను వేయించాడు. ఆ సెట్ లో మొదటి షెడ్యూల్ చిత్రీకరణ అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. రికార్డు స్థాయిలో అంచనాలున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని లీక్ ల బెడద నుండి కాపాడేందుకు రాజమౌళి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.
గతంలో బాహుబలి పలు సార్లు లీక్ అయిన విషయం తెల్సిందే. స్టిల్స్ - వీడియోలు పలు లీక్ అయిన కారణంగా సినిమా చిత్రీకరణ సమయంలో జక్కన్న కాస్త ఇబ్బంది పడ్డాడు. అందుకే ఇప్పుడు అలాంటి టెన్షన్ లు ఏమీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. జక్కన్న మూవీ చిత్రీకరణ అంటే ఏ ఒక్కరు కూడా మొబైల్ క్యారీ చేయడానికి వీలు లేదు. సెట్ లోకి ఎవ్వరు కూడా మొబైల్స్ తీసుకు వెళ్లకూడదు అనేది మొదటి రూల్. సెట్ లోకి ఎవరు మొబైల్ తీసుకు వెళ్లకున్నా కూడా సెట్ లో జామర్ లను ఏర్పాటు చేయిస్తున్నాడు. చైనా నుండి అత్యాధునిక జామర్ ను జక్కన్న తెప్పించాడట. సెట్ లో ఎవరైనా సీక్రెట్ కెమెరాలను, బటన్ కెమెరాలను పట్టుకు, పెట్టుకు వచ్చినా కూడా జామర్ వల్ల అవి పని చేయకుండా పోతాయి.
చాలా ప్రతిష్టాత్మకమైన మూవీ అవ్వడంతో పాటు, సెట్ మరియు హీరోల లుక్స్ రివీల్ కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఏ చిన్న ఛాన్స్ తీసుకోవద్దని జక్కన్న భావిస్తున్నాడు. అందుకే జామర్స్ ను వాడుతున్నాడట. జక్కన్న ఏ పని చేసినా ఎంత జాగ్రత్తగా - ఎంత శ్రద్దగా చేస్తాడో దీంతో మరోసారి నిరూపితం అవుతుంది. ఈమద్య దాదాపు అందరు హీరోల సినిమాల స్టిల్స్ ఏదో విధంగా లీక్ అవుతూనే ఉన్నాయి. మరి జక్కన్న తన సినిమా స్టిల్స్ లీక్ కాకుండా ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.