దాసరి మరణంపై రాజశేఖర్ సందేహాలు

Update: 2017-06-11 07:48 GMT
సీనియర్ హీరో రాజశేఖర్ సినిమాల్లోకి రాకముందు డాక్టర్ అన్న సంగతి తెలిసిందే. సినిమాల్లో కొనసాగుతూ కూడా వైద్య వృత్తిని వదిలి పెట్టేయలేదు. మూవీ మొఘల్ రామానాయుడికి చివరి రోజుల్లో రాజశేఖర్ వైద్య పరమైన సాయం అందించినట్లు చెబుతారు. ఇటీవలే మృతి చెందిన దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి విషయంలో ఒక వైద్యుడిగా తనకు కొన్ని సందేహాలున్నట్లుగా రాజశేఖర్ మాట్లాడాడు. దాసరికి వైద్యం అందించే విషయంలో ఎక్కడో ఏదో పొరబాటు జరిగిందని రాజశేఖర్ అభిప్రాయపడ్డాడు. దాసరి సంస్మరణ సభలో మాట్లాడుతూ రాజశేఖర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

దాసరి తన లాంటి ఎంతోమందికి స్ఫూర్తి అని.. ఆయన లేని లోటును ఎవ్వరూ పూడ్చలేరని అన్న రాజశేఖర్.. ఆయన 75 ఏళ్ల వయసులోనే చనిపోతారని తాను అస్సలు ఊహించలేదని అన్నాడు. చనిపోవడానికి కొన్ని నెలల ముందు కూడా దాసరి చాలా ఆరోగ్యంగా కనిపించారని.. అందుకే ఆయనకు ఇలా కావడం తనకు పెద్ద షాక్ అని రాజశేఖర్ అన్నారు. ఆయనకు సరైన వైద్యం అందిందా.. ఒక వేళ అంది ఉంటే ఎక్కడైనా ఏదైనా పొరబాటు జరిగిందా అన్నది తెలియాల్సి ఉందన్నారు. ఏదేమైనప్పటికీ ఘోరం జరిగిపోయిందని.. దాసరి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. దాసరి బరువు తగ్గించుకునే క్రమంలో రెండోసారి చేయించుకున్న సర్జరీ ఫెయిలైందని.. దాని మూలంగానే రకరకాల కాంప్లికేషన్లు వచ్చి చనిపోయారని ఆయన తనయురాలు హేమాలయ.. అల్లుడు రఘు (డాక్టర్) వెల్లడించిన సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News