మెగా ఫ్యామిలీతో జీవిత రాజశేఖర్ కి విభేధాలున్నాయని మీడియాలో చాలాసార్లు కథనాలు హైలైట్ అయిన సంగతి తెలిసిందే. ఆ రెండు కుటుంబాల మధ్య అసలు వైరం ఎక్కడ మొదలైంది? అన్నది ఇప్పటికీ మిస్టరీనే. మెగాస్టార్ చిరంజీవి ఏనాడు దీనిపై స్పందించింది లేదు. అలాగే జీవితా రాజశేఖర్ కూడా మెగా ఫ్యామిలీతో గొడవలున్నాయని పబ్లిక్ గా చెప్పింది లేదు. ఆ ఫ్యామిలీపై సూటిగా దాడి చేసింది లేదు. రాజశేఖర్ ని ఎదగనివ్వకుండా కొందరు కుట్రలు పన్నుతున్నారనే మీడియా కథనాలు వైరల్ అయ్యాయి తప్ప! ఎవరు ఆ పనిచేస్తున్నారన్నది పబ్లిక్ గా ఏ రోజు బయటకు రాలేదు. దానికి మెగా ఫ్యామిలీతో ముడిపెడుతూ కట్టు కథనాలు కొన్ని మీడియాలు వెలువరించాయి.
వైరం ఉందా లేదా? అన్నదానిపూ పూర్తి స్పష్ఠత అయితే లేదు. ఆ మధ్య `మా` అసోసియేషన్ డైరీ లాంచ్ ఈవెంట్లో `మా` క్రమశిక్షణా సంఘం పెద్దలు అయిన చిరంజీవి.. మోహన్ బాబు.. కృష్ణం రాజు.. మురళీ మోహన్ లకు రాజశేఖర్ పాదనమస్కారం చేసే ప్రయత్నం చేయడం సంచలనం అయిన సంగతి తెలిసిందే. వీకే నరేష్ తో వివాదాల నేపథ్యంలో రాజశేఖర్ పై క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకున్న క్రమంలో అలా జరిగింది. కానీ రాజశేఖర్ ఆ రోజు ఎందుకు అలా చేసారో అంటూ అంతా కన్ఫ్యూజ్ అయ్యారు. ఆ సమయంలో సినీపెద్దలంతా ఇబ్బందిగా పీలయ్యారు. ఇండస్ట్రీలో ఎవరికి వారు ఎదుగుతున్నారు. ఎవరి పనులు వాళ్లు చూసుకుంటున్నారు. అంత మాత్రాన మెగా ఫ్యామిలీతో రాజశేఖర్ కుటుంబానికి ఉన్న వైరం ఏమిటో కానీ ఎవరికీ క్లారిటీ లేదు!
తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీతో ఎలాంటి పొరపొచ్చాలు లేవని జీవిత వెల్లడించారు. ఒకవేళ ఉన్నా అదంతా ముగిసిన అధ్యాయమని అన్నారు. ఇక `మా` ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బండ్ల గణేష్ తప్పుకోవడం... జీవితారాజశేఖర్ ఆ స్థానంలో పోటీ చేయడం గురించి తెలిసిందే. జీవితకు మెగా కాంపౌండ్ నుంచి అండదండలు ఉండడం వల్లనే ఇది సాధ్యమైందన్నది బహిరంగ రహస్యం.
తాజా ట్విస్టుపైనా జీవిత వివరణ ఇచ్చారు. గత `మా` ఎన్నికల్లో తనతో పాటు గెలిచిన వారంతా ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉన్నారని.. వాళ్లు తనని పిలవడమే గాక.. ప్రకాష్ రాజ్ మాట్లాడి ఆహ్వానించడంతో ఆ ప్యానెల్ లోకి వెళ్లినట్లు వివరణ ఇచ్చారు. బండ్ల గణేష్ తోనే ఎలాంటి విభేధాలు లేవు. తనకి ఇష్టమైన చోట పోటీ చేసే హక్కు అతడికి ఉంది. ఆయన గురించి మాట్లాడాల్సిన పనిలేదని జీవిత అనడం కొసమెరుపు.
అయితే జీవిత వెర్షన్ కి పూర్తి కాంట్రాస్ట్ గా బండ్ల గణేష్ వెర్షన్ ఉంది. ఇంతకుముందు ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన బండ్ల గణేష్ .. తాను దైవాలుగా భావించి ఆరాధించే మెగాస్టార్ చిరంజీవి పవన్ పై జీవిత రాజశేఖర్ కుటుంబం ఇంతకుముందు తప్పుగా మాట్లాడిందని అందువల్ల తాను వారికి వ్యతిరేకినని అన్నారు. ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ లో సర్ధుబాటు చేయకపోవడం వల్లనే ఇప్పుడు జీవిత పై పోటీకి దిగుతున్నానని అన్నారు. తాను కూడా జనరల్ సెక్రటరీగా పోటీ చేయడానికి కారణం జీవిత మెగా ఫ్యామిలీ వ్యతిరేకి కావడమేనని స్పష్ఠంగా బండ్ల దునుమాడారు. మొత్తానికి `మా` ఎలక్షన్ రసవత్తరంగా మారింది. అక్టోబర్ 10న ఈ ఎన్నికలు జరగనున్నాయి.