బాలయ్య సినిమాలో ఒరిజినల్ రాజశేఖర్?

Update: 2022-06-20 12:30 GMT
విభిన్నమైన కామెడీ ఎంటర్టైనర్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనుకున్న అనిల్ రావిపూడి తదుపరి సినిమాను నందమూరి బాలకృష్ణ తో చేయబోతున్న విషయం తెలిసిందే. అసలైతే కెరీర్ మొదట్లోనే బాలయ్య బాబు తో సినిమా చేయాలని ఈ దర్శకుడు చాలా ప్రయత్నాలు చేసాడు. కానీ ఊహించని విధంగా ఆ ప్రణాళికలు అన్నీ కూడా వృధా అయిపోయాయి. బాలయ్య బాబు కూడా అప్పుడు చాలా బిజీగా ఉండడంతో అనిల్ రావిపూడి తో సినిమా చేయలేకపోయాడు.

ఇక ఇప్పుడు అతను మంచి సక్సెస్ ట్రాక్లో ఉండడంతో మిగతా కథలను పక్కన పెట్టి మరి అనిల్ తో సినిమా చేసేందుకు బాలయ్య సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా అయిపోగానే నందమూరి బాలకృష్ణ జులై ఫస్ట్ వీక్ నుంచి అనిల్ రావిపూడి దర్శకత్వం లో కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ కానున్నాడు.

అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తాడని సమాచారం.

బాలయ్య బాబు ఈ సినిమాలో 45 ఏళ్ల పైబడిన ఒక వ్యక్తిగా అలాగే ఒక 18 ఏళ్ళ కూతురికి తండ్రిగా కూడా కనిపించబోతున్నాడు. అయితే ఆయనకు మంచి స్నేహితుడిగా ఒక కామెడీ పాత్రలు రాజశేఖర్ ను తీసుకోబోతున్నట్లు సమాచారం.

సాధారణంగా రాజశేఖర్ ఏ సినిమా చేసినా కూడా ఆయన వాయిస్ కు సాయికుమార్ డబ్బింగ్ చెబుతూ వస్తున్నారు. కానీ అనిల్ రావిపూడి మాత్రం రాజశేఖర్ ఒరిజినల్ వాయిస్ తోనే మ్యాజిక్ క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ ప్లాన్ అయితే చర్చల దశలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. బాలయ్యబాబు అలాగే రాజశేఖర్ తో కూడా మరొకసారి చర్చలు జరిపిన అనంతరం అనిల్ రావిపూడి ఈ ప్లాన్ తో ముందుకు వెళ్లే అవకాశం ఉందట. ఒకవేళ అదే నిజమైతే రాజశేఖర్ పాత్ర భిన్నంగా హైలెట్ అవుతుందని చెప్పవచ్చు.
Tags:    

Similar News