యంగ్ డైరెక్ట‌ర్ తో యాంగ్రీ యంగ్ మెన్‌!

Update: 2022-08-04 05:36 GMT
డా. రాజ‌శేఖ‌ర్ యాంగ్రీ యంగ్ మెన్ ఇమేజ్ ని సొంతం చేసుకుని ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచారు. `అంకుశం` సినిమాతో ప‌వ‌ర్ ఫుల్ ఇమేజ్ ని ద‌క్కించుకున్న డా. రాజ‌శేఖ‌ర్ ప్ర‌స్తుతం ఆ ఫామ్ ని కోల్పోయారు. గ‌త కొంత కాలంగా త‌న‌దైన మార్కు సినిమాల‌తో ఆక‌ట్టుకోవాల‌ని మ‌ళ్లీ ఫామ్ లోకి రావాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆ మ‌ధ్య ప్ర‌వీణ్ స‌త్తారు తెర‌కెక్కించిన `పీఎస్వీ గ‌రుడ‌వేగ‌` మూవీతో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చారు.

ఎన్ ఐఏ ఆఫీస‌ర్ గా రాజ‌శేఖ‌ర్ న‌టించిన ఈ మూవీ అత‌నికి మంచి విజయాన్ని అందించ‌డ‌మే కాకుండా ప‌ట్టుత‌ప్పిన కెరీర్ ని మ‌ళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చింది.

ఈ మూవీ అందించిన ఉత్సాహంతో రాజ‌శేఖ‌ర్ మ‌రో పోలీస్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. అదే `క‌ల్కి`. ప్ర‌శాంత్ వ‌ర్మ రూపొందించిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. యావ‌రేజ్ మూవీగా నిలిచింది. దీనికి త‌రువాత క‌రోనా సోక‌డం, ప‌రిస్థితి క్రిటిక‌ల్ గా మార‌డంతో కొంత విరామం తీసుకున్న రాజ‌శేఖ‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ `శేఖ‌ర్` తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు.

మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `జోసెఫ్‌` ఆధారంగా రూపొందిన ఈ మూవీ ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. న‌టుడిగా రాజ‌శేఖ‌ర్ కు మంచి మార్కులు ప‌డినా క‌థ‌, క‌థ‌నాల‌ని జీవితా రాజ‌శేఖ‌ర్ స‌మ‌ర్ధ‌వంతంగా న‌డిపించ‌లేక‌పోవ‌డంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ గా నిలిచింది.

రాజ‌శేఖ‌ర్ త‌న కెరీర్ ఈ సినిమాతో మ‌ళ్లీ కొత్త బాట ప‌డుతుందని బ‌లంగా న‌మ్మాడు కానీ అది జ‌ర‌గ‌లేదు. తీవ్రంగా నిరాశ‌కు గురిచేసింది.  ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత రాజ‌శేఖ‌ర్ యంగ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినితో క‌లిసి ప‌ని చేయ‌బోతున్నాడు.

ఈ మూవీని మార్కాపురం శివ‌కుమార్ నిర్మించ‌బోతున్నారు. గ‌తంలో `కార్తికేయ‌` చిత్రాన్ని విడుద‌ల చేసిన ఆయ‌న గ‌త కొంత కాలంగా సినిమాల నిర్మాణానికి దూరంగా వుంటూ వ‌స్తున్నారు. తాజాగా డా. రాజ‌శేఖ‌ర్ తో ఓ ప‌వ‌ర్ ఫుల్ స్టోరీతో సినిమా చేయ‌బోతున్నార‌ట‌. ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News