సుమ అండ్ రాజీవ్.. హౌ లవ్లీ యార్!!

Update: 2016-08-16 08:57 GMT
మొన్న 'జనతా గ్యారేజ్‌' సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్లో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ సన్నివేశం ఇప్పుడు అందరి హృదయాలను టచ్ చేస్తోంది. చీటికీ మాటికీ విడిపోయే చాలామంది సినిమా జంటలకు ఈ ఇన్సిడెంట్ చాలా నేర్పించాలని అంటున్నారు సినిమా విశ్లేషకులు.

నిజానికి యాక్టర్ గా రాజీవ్ కనకాలకు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ.. కమర్షియల్‌ గా మాత్రం అతగాడి భార్య - యాంకర్ సుమ - కమర్షియల్ గా చాలా సక్సెస్ ఫుల్. ఒక ఈవెనింగ్ ఆడియో హోస్టింగ్ చేస్తేనే ఆమె లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తుందంటే చూసుకోండి. ఇక మొన్న 'జనతా గ్యారేజ్' ఆడియో లాంచ్ లో తన భర్త రాజీవ్ ను స్టేజీ మీద పిలువడడానికి.. 'జనతా గ్యారేజ్ జనులకు బలం అయితే.. నా బలం.. ఇప్పుడు వస్తున్నారు' అంటూ రాజీవ్ కనకాలను ఇన్వయిట్ చేసింది. స్టేజీ మీదకు వచ్చాక రాజీవ్ మాట్టాడేది సరిగ్గా అందరికీ వినిపించట్లేదేమో అని.. ఆల్రెడీ అతడి చేతిలో ఒక మైక్ ఉంటే రెండో మైక్ కూడా ఇచ్చింది. ''ఒక మైకు సరిపోదేమోనని నాకు ఇంకో మైక్ ఇచ్చిన నా బలం తను'' అంటూ రాజీవ్ కూడా ఛలాకీగా చెప్పాడు. ఇదంతా చూస్తుంటే వారి మధ్యన ఉన్న ప్రేమ గురించి ఎవరికైనా అర్ధమవుతుంది.

చిన్నచిన్న గొడవలకే విడిపోతున్న సినిమా సెలబ్రిటీలు వీళ్ళను చూసి బహుశా నేర్చుకోవాలేమో. ఒకరికొకరు అలా నువ్వు నా బలం అంటే నువ్వు నా బలం అనుకుంటూ ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి. హౌ లవ్లీ యార్!!
Tags:    

Similar News