ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టెయిన్మెంట్స్.. టాలీవుడ్ లో మంచి వాల్యూస్ ఉన్న బ్యానర్ గా ఎదుగుతున్న బ్యానర్ ఇది. స్నేహితుడు రాజీవ్ రెడ్డి.. సాయి బాబు.. సుహాసిని పంగులూరితో కలిసి.. దర్శకుడు క్రిష్ నిర్వహిస్తున్న బ్యానర్. దాదాపుగా క్రిష్ తీసే సినిమాలన్నీ ఈ బ్యానర్ పైనే ఉంటాయి.
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సెంచరీ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి కూడా వీరే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 'బాలయ్య వందో సినిమా కోసం ఎన్నో బ్యానర్లు పోటీ పడ్డా మాకు అవకాశం ఇచ్చారాయన. శాతకర్ణి మా బ్యానర్ పై వస్తున్న ఐదో సినిమా. స్క్రిప్ట్ దశలో కొద్దికొద్దిగా తెలుసంతే. బాలయ్యగారిని మొదటి సారి కలిసే సమయానికే పూర్తి స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్నాడు క్రిష్. స్టోరీ విన్న అరగంటలోనే బాలయ్య ఓకే చేసేశారు. యంగ్ యాక్టర్స్ ఆయన్నుంచి చాలా నేర్చుకోవాలి' అంటున్నారు రాజీవ్ రెడ్డి.
'విదేశీ ప్రయాణంలో బిజినెస్ క్లాస్ వద్దనే వారు బాలయ్య. మాతో పాటు ఎకానమీలోనే వచ్చేవారు. ప్రస్తుతం గౌతమిపుత్రకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. క్రిష్ పెళ్లి కారణంగా కొంత గ్యాప్ వచ్చిన మాట నిజమే. ప్రాజెక్టు ఆలస్యం కాకూడదనే ఉద్దేశ్యంతో రోజుకు 18 గంటలు పని చేసేస్తుంన్నాం. పెద్ద ఉత్సవ రథాన్ని క్రిష్ ఒక్కడే లాగేస్తున్నట్లుగా ఉంది. మేమంతా తనకు హెల్ప్ చేస్తున్నామంతే. కొత్తగా పెళ్లైన క్రిష్.. వారం పది రోజులు ఇంటికి కూడా వెళ్లడంలేదు. ఈ విషయంలో క్రిష్ భార్య రమ్య అందిస్తున్న సహకారం మరువలేనిది' అని చెప్పాడు గౌతమిపుత్ర శాతకర్ణి నిర్మాత.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/