సీనియర్ నటుడిపై సంచలన ఆరోపణలు రావటం కాస్త తక్కువే. మిగిలిన వుడ్డుల్లో సంగతి ఎలా ఉన్నా.. టాలీవుడ్ లో మాత్రం అలాంటి ధోరణి పెద్దగా కనిపించదు. అందుకు భిన్నంగా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ పై తాజాగా వైరల్ అయిన ఒక ఆరోపణ ఆయన్ను ఇబ్బంది పెట్టటమే కాదు.. సంచలనంగా మారింది. ఆయన తాజాగా నటించిన ఓ బేబీ చిత్రంలో ఒక సన్నివేశానికి తాగి నటించాల్సి ఉంది.
ఈ సీన్ కు సంబంధించి రాజేంద్రప్రసాద్ నిజంగానే తాగేసి యాక్ట్ చేశారని.. ఆ సందర్భంగా సెట్ లో ఉన్న నటీమణులు తీవ్ర అసౌకర్యానికి గురైనట్లుగా ఒక వీడియో వార్త హడావుడి చేస్తోంది. ఇది కాస్తా వైరల్ గా మారింది. దీంతో.. ఈ ఉదంతంపై తాజాగా జరిగిన ప్రిరిలీజ్ ప్రోగ్రామ్ లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రాజేంద్రప్రసాద్.
తాను చదువుకున్న నటుడినని.. సీనియర్ ఎన్టీఆర్ మాదిరి పాత్రలో లీనమై నటిస్తానని.. ఎందుకంటే తనను ఆయనే పరిచయం చేశారన్నారు. అలాంటి అలవాటుతో ఓ బేబీ చిత్రంలో తాగిన సీన్ చేయాల్సి వచ్చినప్పుడు.. ఆ సీన్లో లీనమై నటించానే తప్పించి తాను తాగి నటించలేదన్నారు. ఒక మూర్ఖుడు నిజం తెలుసుకోకుండా తన మీద అబద్ధం రాశారన్నారు.
అసలు విషయం తెలుసుకోకుండా అబద్ధాన్ని రాశాడని.. అది అతడి ఖర్మ అని.. ఎవరేమనుకున్నా.. తాను మాత్రం సెట్లో ఎవరికి ఎలాంటి ఇబ్బందిని కలుగజేయలేదని కచ్ఛితంగా చెప్పగలనని చెప్పారు. తాను సెట్ కు తాగి రాలేదని చెప్పారు. ఒక మూర్ఖుడి మాటల్ని అంత సీరియస్ గా తీసుకునే బదులు లైట్ తీసుకోవాల్సింది.