తెలుగు తెరపై హాస్యాన్ని పరుగులు తీయించిన కథానాయకుడిగా రాజేంద్రప్రసాద్ కనిపిస్తారు. ఎలాంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన రాజేంద్రప్రసాద్, హీరోగా గట్టి పోటీని తట్టుకుంటూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. నటుడిగా ఆయన తన ప్రస్థానాన్ని మొదలుపెట్టేసి 43 సంవత్సరాలు పూర్తికావడం విశేషం. ఆయన తాజా చిత్రంగా విడుదలైన 'గాలి సంపత్' ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు.
నటుడిగా 43 ఏళ్లు గడిచిపోయాయంటే నాకే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. చిటికె వేసినంత సేపట్లో ఈ సమయమంతా గడిచిపోయినట్టుగా అనిపిస్తోంది. ఒక్కసారి వెనక్కి వెళితే ఎన్నో అందమైన జ్ఞాపకాలు పలకరిస్తున్నాయి. కెరియర్ తొలినాళ్లలో 'రామరాజ్యంలో భీమరాజు' సినిమాలో నేను కృష్ణగారి కాంబినేషన్లో ఒకే ఒక్క సీన్ చేశాను. నా యాక్టింగ్ చూడగానే ఆయన ఒకేసారి 24 సినిమాల్లో నాకు అవకాశాలు ఇప్పించారు. అది కృష్ణగారి మంచి మనసు .. ఆయన గొప్పతనం. ఈ విషయాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను.
సుదీర్ఘమైన నా కెరియర్లో చాలామంది దర్శకులతో కలిసి పనిచేశాను. ఇప్పుడు వస్తున్న దర్శకులంతా చాలా టాలెంటెడ్. వాళ్లు పాత్రలను క్రియేట్ చేస్తున్న తీరు గొప్పగా ఉంటోంది. 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' .. 'నాన్నకు ప్రేమతో' .. 'శ్రీమంతుడు' .. 'ఎఫ్ 2' .. 'మహానటి' .. 'ఓ బేబీ' సినిమాల్లో నేను చేసిన పాత్రలన్నీ ఒకదానితో ఒకటి పొంతన లేనివే. ఈ పాత్రలన్నీ కూడా నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కానీ నిజానికి ఈ క్రెడిట్ అంతా కూడా ఆ సినిమాల దర్శకులకే చెందుతుంది. వాళ్లు అలాంటి పాత్రలను క్రియేట్ చేయడం వల్లనే, ఇలా ఇంతకాలం నేను తెరపై కనిపించగలుగుతున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.