రోజులుగా వేగంగా గడిచిపోతున్నాయి. ఈ ఏడాది ఇండియన్ ప్రేక్షకులంతా అత్యంత ఆసక్తితో.. ఉత్కంఠతో ఎదురు చూస్తన్న సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్-ఏస్ డైరెక్టర్ శంకర్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన మెగా మూవీ ‘2.0’ సరిగ్గా ఇంకో ఏడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి నవంబరు 29కి ఫిక్సయిన ‘2.0’.. ఆ తేదీకైనా పక్కాగా వస్తుందా రాదా అన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి. ఐతే ఇటీవలి పరిణామాలు చూస్తుంటే ఈసారి రిలీజ్ పక్కా అనే అనిపిస్తోంది. తాజాగా చిత్ర బృందం మరోసారి రిలీజ్ డేట్ ధ్రువీకరిస్తూ పోస్టర్లు రిలీజ్ చేసింది. అలాగే ట్రైలర్ లాంచ్ కోసం కూడా ముహూర్తం ఫిక్స్ చేసింది. దీపావళి కానుకగా.. పండక్కి నాలుగు రోజుల ముందే ‘2.0’ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు.
నవంబరు 3న ‘2.0’ ట్రైలర్ రిలీజవుతుందని స్వయంగా దర్శకుడు శంకరే ఈ రోజు ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించాడు. ‘ఫిఫ్త్ ఫోర్స్ ఈజ్ కమింగ్’ అంటూ దీనికి క్యాప్షన్ కూడా జోడించాడు శంకర్. మొబైల్ ను కమ్మేస్తున్న రాక్షస చేతిని చూపిస్తూ పోస్టర్ డిజైన్ చేశారు. ట్రైలర్లో ఏముంటుందనడానికి ఇది సంకేతం. జనాల్లోని మొబైల్ అడిక్షన్ కు వ్యతిరేకంగా విలన్ విపరీత చర్యలకు దిగితే.. అతడిని అడ్డుకోవడానికి రక్షకుడిలా వచ్చే చిట్టి రోబో కథే ‘2.0’. విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో జాప్యం వల్ల ఎప్పుడో ఏడాది కిందటే రావాల్సిన ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడి.. చివరికి నవంబరు 29కి ఫిక్సయింది. చిత్ర బృందం నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం అతి త్వరలోనే ‘2.0’ ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావచ్చాయి.