నెల రోజులుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ‘బాహుబలి: ది కంక్లూజన్’ గురించే చర్చ. బాహుబలి మీద.. రాజమౌళి మీద ప్రశంసలు కురిపించడం వరకు ఓకే కానీ.. మిగతా సినిమాల్ని.. మిగతా ఫిలిం మేకర్లను తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు జరగడమే అభ్యంతరకరం. బాహుబలి-2ను చూసి బాలీవుడ్డోళ్లు సిగ్గుపడాలని.. దాన్ని కొట్టే దమ్మున్న సినిమా సమీప భవిష్యత్తులో రాబోతోదని.. రాజమౌళి ముందు అందరూ దిగదుడుపే అని.. ఇలా రకరకాల కామెంట్లు వినిపించాయి. ఐతే ‘బాహుబలి-2’ను అతిగా మోసేస్తున్న వాళ్లకు ‘దంగల్’ పెద్ద షాకే ఇచ్చింది. చైనాలో ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కొల్లగొట్టి ‘బాహుబలి-2’ వసూళ్లు దాటేసి.. దాని విలువను తగ్గించేసింది.
ఐతే ‘దంగల్’ చైనాలో అనుకోకుండా ఆడేసింది కాబట్టే ‘బాహుబలి-2’ రికార్డుల్ని దాటేసిందని.. ఇండియా వసూళ్ల వరకు వస్తే దాన్ని కొట్టే సినిమా ఇప్పుడిప్పుడే రాదని అంటున్నారు. కానీ ఇంకో ఎనిమిది నెలల్లో ‘బాహుబలి-2’కు సంబంధించి అన్న రికార్డులూ బద్దలైపోతే ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు. వచ్చే ఏడాది జనవరిలో రజినీకాంత్-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘2.0’ విడుదల కాబోతోంది. ‘బాహుబలి’లో మత్తులో ఉండి ‘2.0’ను తక్కువ అంచనా వేస్తే కష్టమే. ఎందుకంటే ఆ సినిమా విడుదలయ్యే సమయానికి హైప్ మామూలుగా ఉండకపోవచ్చు. పోయినేడాది రజినీ నటించిన ‘కబాలి’కి ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే. ఇక రజినీ శంకర్ తో కలిస్తే హైప్ మామూలుగా ఉంటుందా?
ఇండియన్ మార్కెట్ పరిధి తక్కువున్నపుడే.. ఏడేళ్ల కిందటే ‘రోబో’ మామూలు వసూళ్లు సాధించలేదు. అప్పుడే బాలీవుడ్ వాళ్లు విస్తుబోయేలా వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు రీజనల్ సినిమా మార్కెట్ బాగా విస్తరించింది. సౌత్ ఇండియాలో ఆ సినిమాకు ఏ స్థాయిలో హైప్ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అక్షయ్ కుమార్ విలన్ పాత్ర చేస్తున్నాడు కాబట్టి నార్త్ ఇండియాలోనూ క్రేజ్ కు ఢోకా ఉండదు. మొత్తం దేశవ్యాప్తంగా మంచి హైప్ మధ్య.. భారీ స్థాయిలో సినిమా రిలీజయ్యే అవకాశాలున్నాయి. ‘రోబో’ సీక్వెల్ కాబట్టి.. ఏదో ఒక వర్గం అని కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులూ ఈ సినిమా చూస్తారు. ముఖ్యంగా పిల్లలు ‘2.0’ మీద అమితాసక్తి ప్రదర్శించడం కూడా ఆ సినిమా లాంగ్ రన్ కు ఉపయోగపడుతుంది. కాబట్టి ‘2.0’ అంచనాలకు తగ్గట్లు ఉంటే మాత్రం కలెక్షన్ల మోత మామూలుగా ఉండదు. ‘బాహుబలి-2’ రికార్డులు బద్దలవకా తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/