ఇది రాబోయే సినిమాకు సంబంధించిన కబురు కాదులెండి. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు సంబంధించిన ఒక హైపోథెటికల్ విషయం. ఈ సినిమాలో మహేష్ తండ్రిగా సత్యరాజ్ నటించిన సంగతి తెలిసిందే. ఐతే ఆ పాత్రలో రజినీకాంత్ నటించి ఉంటే ఎలా ఉండేదో ఓసారి ఊహించుకోండి..? ఇలాంటి వయొలెంట్ థాటే వచ్చిందట శ్రీకాంత్ అడ్డాలకు. ముందు నిర్మాత పీవీపీకి కథ చెప్పినపుడు ఈ పాత్రను రజినీకాంత్ తో చేయిస్తే ఎలా ఉంటుందా అని అడిగాడట అతను. అయినా ఇలాంటి క్లాస్ సినిమాలో రజినీ లాంటి మాస్ హీరో.. సాఫ్ట్ గా ఉండే ఫాదర్ క్యారెక్టర్ చేస్తారని ఎలా అనుకున్నారో ఏంటో? బహుశా ఈ సందేహంతోనే ఆ ఆలోచన పక్కనబెట్టేసినట్లున్నారు.
రజినీతో పాటు ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్ బాబాయిగా నటిస్తున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పేరు కూడా మహేష్ ఫాదర్ క్యారెక్టర్ కోసం పరిశీలించారట. ఐతే చివరికి నిర్మాత పీవీపీ ఇష్టప్రకారం సత్యరాజ్ ను ఎంపిక చేసుకున్నారట. ఈ విషయాన్ని పీవీపీనే స్వయంగా వెల్లడించారు. ‘‘బ్రహ్మోత్సవం సినిమాకు అత్యంత సవాలుగా నిలిచింది నటీనటుల ఎంపికే. చాలామంది ఆర్టిస్టులుండటంతో అందరి ఫొటోలతో ఓ ఆల్బమ్ తయారు చేసుకున్నాం. తర్వాత ఒక్కొక్కరినే సంప్రదించాం. ఐతే మహేష్ తండ్రి పాత్ర విషయంలో చాలా తర్జన భర్జనలు నడిచాయి. రజినీకాంత్..మోహన్ లాల్ పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయి. కానీ నాకైతే సత్యరాజే కరెక్ట్ అనిపించింది. ఆయన్నే ఫైనల్ చేశాం’’ అని పీవీపీ చెప్పారు.