రెండేళ్ల కిందటి సంగతి. 2018లో తూతుకూడి కాపర్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసనలకు దిగిన ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడం.. ఈ ఘటనలో పది మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం సంచలనం రేపింది. నాటి ఆ ఫైరింగ్ బాధిత కుటుంబాల్ని పరామర్శించేందుకు తూత్తుకుడి వెళ్లారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఐతే ఆ సమయంలో సంతోష్ అనే యువకుడు రజనీకాంత్ కు అడ్డం పడి ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఎవరు నువ్వు.. మమల్ని ఎందుకు పరామర్శించడానికి వచ్చావంటూ రెచ్చిపోయాడు. తన కాలా సినిమాను ప్రమోట్ చేసుకోవడానికే రజనీ అక్కడికి వచ్చాడంటూ కూడా విమర్శించాడు రజనీ ఎంతో ఓపిగ్గా మాట్లాడినా ఆ కుర్రాడు అలాగే రెచ్చిపోయాడు తప్ప తగ్గలేదు.
అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఘటనతో తమిళనాట సంతోష్ హాట్ టాపిక్ అయ్యాడు. రజనీని అడ్డుకున్న కుర్రాడంటూ అతడి గురించి జనాలు చర్చించుకున్నారు. అప్పుడలా పాపులర్ అయిన సంతోష్.. ఇప్పుడు దొంగతనం కేసులో అరెస్టవడం గమనార్హం. అతను బైక్ దొంగతనం ఆరోపణలపై అరెస్టవడం విశేషం. తన బైక్‌ను దొంగిలించాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పొలీసులు అదుపులోకి తీసుకొన్నారు. సంతోష్‌తోపాటు ముగ్గురిని అరెస్ట్ చేసి బైక్‌ను స్వాధీనం చేసుకొన్నారని మీడియా వెల్లడించింది. అప్పట్లో సంతోష్‌కు మద్దతుగా మాట్లాడిన వాళ్లూ ఉన్నారు. రజనీ స్థాయి సెలబ్రెటీని ధైర్యంగా ప్రశ్నించాడంటూ పొగిడారు. కానీ ఇప్పుడేమో దొంగతనం కేసులో సంతోష్ అరెస్టవడంతో ఒక్కసారీగా జీరో అయిపోయాడు.