రజినీకాంత్ లేటెస్ట్ మూవీ కాలా.. జూన్ 7న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది. గతంతో పోల్చితే అంచనాలు బాగానే తగ్గాయి కానీ.. రజినీ మూవీ ఎప్పుడు ఎలాంటి మేజిక్ చేస్తుందనే సంగతి చెప్పలేం. టాక్ కాసింత బాగా వచ్చినా సరే.. సడెన్ గా సెన్సేషన్స్ సృష్టించే ఛాన్సులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
అయితే.. ఇలాంటి సమయంలో కాలాకు ఓ బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. ఇందుకు కారణం కూడా సూపర్ స్టారే కావడం గమనించాలి. ఓ రకంగా తన సినిమాకు తానే బ్రేక్ వేసుకున్న సిట్యుయేషన్ ఇది. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న రజినీకాంత్.. రీసెంట్ గా కర్నాటక-తమిళనాడు వాటర్ ఇష్యూ పై కామెంట్ చేశారు రజినీ. కొత్త ముఖ్యమంత్రి కుమారస్వామి.. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి.. తమిళనాడుకు నీళ్లు విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు రజినీకాంత్. ఇది పక్కా కన్నడిగులకు ఏ మాత్రం నచ్చలేదు.
ఇలాంటి సమయంలో కాలా చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించడం.. వారికి ఆవేశం తెప్పించింది. కాలాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయడం మొదలుపెట్టారు. దీంతో కర్నాటక ఫిలిం అసోసియేషన్ కు చెందిన డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు సడెన్ గా భేటీ నిర్వహించారు. అందరూ కలిసి ప్రస్తుతం కాలా విడుదల చేయడం కరెక్ట్ కాదని నిర్ణయించి.. సినిమా రిలీజ్ ను ఆపేశారు. ఓ రకంగా తన మూవీకి తానే పంచ్ వేసుకున్నారు సూపర్ స్టార్.