గత కొన్నేళ్ల వ్యవధిలో ఇండియాలో అత్యంత హైప్ తెచ్చుకున్న సినిమాల్లో ‘కబాలి’ ఒకటి. అలాగే అత్యంత నిరాశ పరిచిన సినిమాల్లో ఒకటిగానూ దాన్ని చెప్పుకోవాలి. ఎన్నెన్నో ఆశలతో ఈ సినిమాకు వెళ్తే అక్కడ బొమ్మ ఇంకోలా కనిపించింది. నీరసించిన సూపర్ స్టార్ ను ప్రేక్షకులు చూడలేకపోయారు. తమిళంలో సినిమా ఓ మోస్తరుగా ఆడింది కానీ.. తెలుగులో మాత్రం దారుణమైన ఫలితం వచ్చింది. ఐతే ఇలాంటి సినిమాకు సీక్వెల్ తీస్తారంటూ అప్పట్లో ఓ ప్రచారం నడిచింది. ‘కబాలి’ ప్రొడ్యూసర్ కలైపులి థాను స్వయంగా ప్రకటన కూడా చేశాడు. కానీ తర్వాత వ్యవహారం సద్దుమణిగింది. అందరూ సైలెంటైపోయారు.
ఐతే ఇప్పుడు ‘కబాలి’ సీక్వెల్ మళ్లీ తెరమీదికి వచ్చింది. తమిళ ఫిలిం ఛాంబర్లో నిర్మాత కలైపులి థాను ‘కబాలి-2’ టైటిల్ రిజిస్టర్ చేయించాడు. దీంతో ‘కబాలి’ సీక్వెల్ పక్కా అని తేలిపోయింది. ఐతే ఆ సినిమా ఎప్పుడుంటుందన్నదే క్లారిటీ లేదు. ‘కబాలి’ అభిమానులకు నిరాశ కలిగించినా.. రజినీ మాత్రం డైరెక్టర్ రంజిత్ మీద నమ్మకం పెట్టాడు. ధనుష్ నిర్మాణంలో రంజిత్ తో ఇంకో సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడు. ప్రస్తుతం ఆ సినిమా ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇది వేరే కథతో తెరకెక్కే సినిమా. ముంబయి నేపథ్యంలో సాగుతుందట. ప్రస్తుతం స్క్రిప్టు రెడీ చేస్తున్న రంజిత్.. వచ్చే ఏడాది రజినీ ‘2.0’ నుంచి ఫ్రీ అయ్యాక ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు.