ఇటీవలి కాలలో టైటిళ్ల రగడ రొటీన్ అయిపోయింది. ఒక నిర్మాత రిజిష్టర్ చేయించిన టైటిల్ ని వేరొకరు ప్రకటించేయడం, సినిమాలు తీయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గతంలో పవన్, బాలయ్య బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్లకు ఇలాంటి సమస్యలొచ్చాయి. అప్పుడు ఏపీ ఫిలింఛాంబర్, నిర్మాతల మండలి చొరవ తీసుకోవడం వల్ల పరిష్కారం దొరికింది.
అయితే లేటెస్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్ కే టైటిల్ సమస్య వచ్చింది. రజనీకాంత్ హీరో గా రంజిత్ దర్శకత్వంలో కళైపులి ఎస్.థాను నిర్మిస్తున్న తాజా చిత్రం ఆన్ సెట్స్ వెళ్లడానికి రెడీ అవుతోంది. ఈలోగానే టైటిల్ 'కబాలి' (డాన్ కబాలీశ్వరుని కథ) అంటూ ప్రచారం సాగించారు. అయితే ఈ టైటిల్ పై ఇప్పటికే ఓ సినిమా తెరకెక్కుతోందన్నది తాజా అప్ డేట్.
తమిళ సీనియర్ నిర్మాత శివకుమార్ ఇప్పటికే ఈ టైటిల్ ని తమిళ ఫిలింఛాంబర్ లో రిజిష్టర్ చేయించారు. పైగా సినిమా షూటింగ్ 90శాతం పూర్తయింది. ఇప్పుడిలా సడెన్గా రజనీ టైటిల్ ఇదే అనేసరికి కంగుతిన్నారాయన. ఆ టైటిల్ నాది. అన్నిచోట్లా రిజిష్టర్ చేయించానంటూ శివకుమార్ మొరపెట్టుకున్నారు. మొత్తానికి పెద్దలు ఈ సమస్యని సమారస్య పూర్వకంగా పరిష్కరిస్తున్నారని తెలుస్తోంది.