సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి.. టీజర్ స్థాయి నుంచే చాలానే సంచలనాలను సృష్టించింది. తమిళ టీజర్ కి సమానంగా కాకపోయినా.. తెలుగులో కూడా స్టార్ హీరోల టీజర్లకు తగ్గకుండా వ్యూస్ వచ్చాయంటే.. ఇక్కడ రజినీ ఏ రేంజ్ లో మాయ చేయబోతున్నాడో అర్ధమవుతుంది.
వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతున్న కబాలి చిత్రం తెలుగు వెర్షన్ కి గాను... ఇంకా ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరగలేదు. రజినీ లేకుండానే.. తమిళ్ వెర్షన్ కి ఆడియో ఫంక్షన్ చేసేసి.. మార్కెట్లోకి ఆడియో ఇచ్చేసిన విషయం తెలిసిందే. అయితే.. తెలుగు విషయంలో ఇప్పటివరకూ స్పష్టత రాలేదు. కానీ ఇప్పుడు దీనిపై అధికారిక ప్రకటన చేశారు తెలుగు నిర్మాతలు కె. ప్రవీణ్ కుమార్. కె.పి. చౌదరి.
ఈ నెల 26న కబాలి తెలుగు వెర్షన్ కు ఆడియో ఫంక్షన్ ను హైద్రాబాద్ లో గ్రాండ్ గా చేయబోతున్నట్లు నిర్మాతలు చెప్పారు. 'సంతోష్ నారయణన్ కంపోజింగ్ లో రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్-వనమాలి ఈ పాటలను రాశారు. సాహితి మాటలను అందించారు. తెలుగు - తమిళ ఇండస్ట్రీల నుంచి దిగ్గజాలను పిలిచి ఈ నెల 26న ఆడియో ఫంక్షన్ చేయబోతున్నాం' అని చెప్పారు కబాలి ప్రొడ్యూసర్స్.