సినిమా క్లాప్ కూడా కొట్టకముందే వార్తలతో పాటు వివాదాల్లోకి ఎక్కుతోంది రజనీకాంత్ కొత్త సినిమా. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో 2,0 చేస్తున్న రజనీకాంత్ తర్వాత సినిమా కబాలి డైరెక్టర్ పా. రంజిత్ తో చేయాలని నిర్ణయించుకున్నారు. కబాలి సినిమాలో మలేషియా సెటిల్ అయిన భారతీయ డాన్ పాత్ర పోషించిన తర్వాత సినిమాలో కూడా డాన్ పాత్రలోనే కనిపించనున్నారని సమాచారం బయటకు వచ్చింది. ముంబయికి చెందిన ఒకనాటి డాన్ హాజీ మస్తాన్ జీవితగాథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరిగింది. 1926 నుంచి 1994 మధ్య జీవించిన హాజీ మస్తాన్ ముంబయి అండర్ వరల్డ్ లో పైకెదిగిన తీరుపై ఈ సినిమా ఉంటుందనే సమాచారం చెన్నైఫిలిం వర్గాల నుంచి వస్తోంది.
ఈ నేపథ్యంలో హాజీమస్తాన్ దత్తపుత్రుడుగా చెప్పుకొంటున్న సుందర్ షకీర్ ఈ సినిమా నిర్మాణానికి సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రజనీకాంత్ కు నోటీసు పంపించాడు. ‘‘జాతీయ స్థాయిలో పేరొందిన రాజకీయ నాయకుడైన హాజీ మస్తాన్ ను మీ చిత్రంలో స్మగ్లర్ గా, అండర్ వరల్డ్ డాన్ గా ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నారు. ఇది మాకెంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. ఈ ఆలోచనను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ’’ ఆ నోటీసులో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన సినిమా వర్గాలు తమ సినిమా హాజీ మస్తాన్ జీవితగాథతో రూపొందడం లేదని క్లారిఫికేషన్ ఇచ్చాయి. ఇది ముంబయి బ్యాక్ డ్రాప్ లో నడిచే ఒక కల్పిత గాథ మాత్రమే. దీనికి ఎవరి జీవితాలతోనూ సంబంధం లేదని ప్రకటించారు.
రజనీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమా కోసం చెన్నై శివారు ప్రాంతాల్లో ముంబయికి చెందిన మురికివాడ ధారావి సెట్ వేయనున్నారు. ఈ ఒక్క సెట్ కోసమే రూ. 5 కోట్లు ఖర్చు చేయనున్నారు. సినిమాలో ప్రధాన భాగం అక్కడే చిత్రీకరించనున్నారని సినిమా వర్గాలు చెబుతున్నాయి. అయినా సినిమా టైటిల్స్ కు ముందు ‘ఈ చిత్ర కథ ఎవరినీ ఉద్దేశించినది కాదు.. అంతా కల్పితమే’ అన్నముక్క వేస్తే చాలు.. ఆ తర్వాత ఏదైనా తీసేయొచ్చు. అంతే కదా!