పాపం సూపర్ స్టార్.. ఎన్ని తిప్పలో..

Update: 2016-08-15 17:30 GMT
సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్యం నుంచి పూర్తిగా రికవర్ అయ్యారని తెలుస్తోంది. కబాలి షూటింగ్ ఫినిష్ చేసేసి అమెరికా వెళ్లిన రజినీ అక్కడ నెల రోజులకు పైగా ఉండిపోయారు. పలు ఇంటర్నల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స తీసుకున్నారని.. అలాగే సర్జరీ కూడా చేయించుకున్నారని వార్తలున్నాయి కానీ.. ఇందులో దేన్నీ రజినీకాంత్ సన్నిహితులు ధృవీకరించలేదు.

కబాలితోపాటు రోబో సీక్వెల్ 2.0 షూటింగ్ ని కూడా చేసిన సూపర్ స్టార్.. ఇప్పుడా సినిమా షూటింగ్ లో తిరిగి భాగం కానున్నారని తెలుస్తోంది. త్వరలోనే ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్ లో రజినీపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని అంటున్నారు. అయితే కబాలి-2.0 షూటింగ్ లు ఒకేసారి చేయాల్సి రావడం రజినీ ఆరోగ్యం దెబ్బ తింటానికి కారణంగా చెబుతున్నారు. మరోవైపు ఇండియా తిరిగొచ్చాక  రజినీకాంత్ ఫ్యాన్సుతో మాట్లాడతారని అన్నారు. కానీ ఇప్పుడా ఆశలు గల్లంతయినట్లే.

సాధారణంగా ఓ సినిమా షూటింగ్ లో ఉన్నపుడు దాని గురించి చెప్పుకుని ప్రచారం చేసే వ్యవహారానికి సూపర్ స్టార్ చాలా దూరం. ఇప్పుడు రోబో 2.0 షూటింగ్ ప్రారంభం అయ్యేలోపు మాట్లాడకపోతే.. ఇక ఇంకో సంవత్సరం వరకు మాట్లాడనట్లే. రోబో2.0 వచ్చాకే ఫ్యాన్సును కలుస్తారాయన. ఆయన సినిమా షెడ్యూల్స్..అనారోగ్యాలు అభిమానులను కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు.  పాపం రజనీకాంత్ కు ఎన్నితిప్పలు వచ్చాయో !!
Tags:    

Similar News