కొంతమంది హీరోలకు హిట్స్ ఫ్లాపులతో సంబంధం ఉండదు. ఆటోమేటిక్ గా వారి కొత్త సినిమాపై ఆసక్తి నెలకొంటుందంతే. జయాపజయాలకు అతీతమైన అలాంటి ఇమేజ్.. స్టార్డమ్ ఉన్న హీరోలలో సూపర్ స్టార్ రజనీ ఒకరు. కబాలి లు కాలా లు షాక్ జనాలకు గట్టిగా షాక్ లు ఇచ్చినా అందరూ ఆసక్తిగా '2.0' సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆ సినిమా సంగతి తేలే లోపే #రజనికాంత్165 సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
తమిళ వెర్షన్ టైటిల్ 'పేట్టా'(పెట్టా అని కూడా కొందరు అంటున్నారు). మరి అర్థం ఏంటి అంటే.. తెలుగులో పేట లాంటిందే. కరెక్ట్ గా అయితే 'అడ్డా'. ఇక ఇంతకంటే మాస్ టైటిల్ ఏముంటుంది చెప్పండి. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రానున్న ఈ సినిమా మోషన్ పోస్టర్లో చాలా రోజుల తర్వాత రజనీ తనకు మాత్రమే సొంతమైన మాస్ స్టైల్ లో కనిపించాడు.
ఒక పాతకాలం చర్చిలాంటి బిల్డింగ్. లోపల కొవ్వొత్తులు వెలుగుతూ ఉంటాయి. పియానో మీటలు అలా పైకి లేస్తాయి. జామెట్రీ బాక్స్ నుండి డివైడర్.. కంపాస్.. స్కేల్ లాంటి ఐటమ్స్ గాలిలో ఎగురుతుంటాయి. వాటితో పాటుగా చాలా కాగితాలు కూడా గాల్లో ఎగురుతూ కనిపిస్తాయి. ఇక మెల్లగా ద్వారములు తెరుచుకుంటాయి. ఆ తర్వాత రజనీ స్టైల్ గా నడుచుకుంటూ వస్తాడు. చేతిలో ఒక పొడవాటి దీపాల కుందె లాంటిది ఉంటుంది. దానికి చివర చాలా క్యాండిల్స్ వెలుగుతూ ఉంటాయి. రజని మెడలో స్కార్ఫ్.. షర్టు మీద షర్టు.. కళ్ళకు కూలింగ్ గ్లాసెస్.. తైలైవర్ స్మైల్ తో అలా పోజిస్తాడు. అంతే!
అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు రజని హీరోయిజం ను మరింతగా ఎలివేట్ చేసేలా ఉంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. త్రిష - విజయ్ సేతుపతి - సిమ్రాన్ - నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తిరు ఈ పేట్టా కు సినిమాటోగ్రాఫర్.
వీడియో కోసం క్లిక్ చేయండి
Full View