తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా త్రిష- సిమ్రాన్ లు హీరోయిన్స్ గా తెరకెక్కిన ‘పెట్టా’ మూవీ సంక్రాంతి కి విడుదల కాబోతుంది. నిన్న మొన్నటి వరకు కూడా ఈ చిత్రం తమిళ వర్షన్ మాత్రమే సంక్రాంతి కి విడుదల కాబోతుందని అంతా అనుకున్నారు. తెలుగుకు సంబంధించిన టైటిల్ అనౌన్స్ చేయడం కాని, తెలుగు లో కనీసం చిన్న పోస్టర్ ను కాని విడుదల చేయలేదు. సంక్రాంతి కి తెలుగు లో పెద్ద సినిమాలు ఉన్న కారణంగా థియేటర్లు దొరడకం కష్టమనే ఉద్దేశ్యం తో తెలుగు లో ఆ సినిమా విడుదల ఆలస్యం చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లుగా వార్తలు టవచ్చాయి. కాని తాజాగా ‘పెట్టా’ చిత్రం సంక్రాంతి కే విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
తెలుగు ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ‘పెట్టా’ చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ ను దక్కించుకున్నాడు. తక్కువ బడ్జెట్ సినిమా అవ్వడంతో పాటు, రజినీ కాంత్ మూవీస్ ఈ మద్య కాలంలో తెలుగు లో పెద్ద గా వసూళ్లు సాధించలేదు. 2.ఓ మినహా ఏ చిత్రం కూడా మినిమం వసూళ్ల ను దక్కించుకోలేక పోయింది. అందుకే ‘పెట్టా’ చిత్రాన్ని సి కళ్యాణ్ కు తక్కువ రేటుకే నిర్మాణ సంస్థ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తాజా గా తెలుగు డబ్బింగ్ రైట్స్ ను దక్కించుకున్న నిర్మాత సి కళ్యాణ్ హడావుడిగా పనులు ప్రారంభించాడు.
డబ్బింగ్ పనులు చేయడం తో పాటు, సినిమా ప్రమోషన్ ను తెలుగు రాష్ట్రాల్లో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. తెలుగు లో ఈ చిత్రంను సి కళ్యాణ్ అయితేనే ఎక్కువ థియేటర్ల లో విడుదల చేయగల సమర్థుడనే ఉద్దేశ్యంతో నిర్మాణ సంస్థ ఆయన కు అప్పగించినట్లు గా చెబుతున్నారు. సంక్రాంతి కి తెలుగు సినిమాలు ఎన్టీఆర్- వినయ విధేయ రామ- ఎఫ్ 2 చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యం లో ఆ చిత్రాలకు పెట్టా మూవీ ఏ స్థాయిలో పోటీని ఇవ్వగలదు అనేది చూడాలి. తెలుగులో రజినీకాంత్ మూవీ ఏ మేరకు ప్రభావంను చూపించనుందనేది కూడా చూడాలి.